220 కోట్లతో వాటర్ ఆగ్మెంటేషన్ స్కీమ్ : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

by Ratna Kumari |

మహబూబ్ నగర్ పట్టణానికి మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనున్నదని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల‌ సమావేశంలో ఆయన మాట్లాడారు.

220 కోట్లతో వాటర్ ఆగ్మెంటేషన్ స్కీమ్ :  ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : మహబూబ్ నగర్ పట్టణానికి మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనున్నదని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం పట్టణ జనాభా సుమారు 3 లక్షల 30 వేలు ఉందని, 2047 కు అది 5 లక్షలకు చేరుకుంటుందని, అందుకు సరిపడా నీటి సరఫరాకు సమగ్ర కార్యాచరణ చేపట్టినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుత జనాభా లెక్కల ప్రకారం 40 ఎంఎల్ డీ మంచినీరు అవసరం ఉండగా.. 20 నుంచి 30 ఎంఎల్ డీ మాత్రమే అందుబాటులో ఉందని, ఈ సమస్య పరిష్కారానికి 220 కోట్లతో వాటర్ ఆగ్మెంటేషన్ స్కీం చేపట్టినట్లు ఆయన అన్నారు.

ఈ ప్రాజెక్టులో భాగంగా 14 రిజర్వాయర్ల నిర్మాణంతో 186 లక్షల లీటర్ల నీటి నిల్వ సామర్థ్యం, 40 కిలోమీటర్ల ఫీడర్, 209 కిలోమీటర్ల డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ తో భవిష్యత్తులో 60 ఎంఎల్ డీ నీటి సరఫరాకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు ఎమ్మెల్యే వివరించారు. గత 2 సంవత్సరాల 3 నెలల ప్రభుత్వ కాలంలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించే లక్ష్యంతో ఇంజనీరింగ్, డిగ్రీ, జూనియర్ కళాశాలలు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, అడ్వాన్స్ ట్రైనింగ్ ఇన్ట్సిట్యూట్ లు, ట్రిపుల్ ఐటీ, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటు చేసి, విద్యార్థుల్లోని ప్రతిభను వెలికి తీసి, వ్యక్తిత్వ వికాసాన్ని, సాంస్కృతిక విలువలను పెంపొందించే దిశగా తీవ్ర ప్రయత్నాలు చేస్తునామన్నారు. ఇలా త్రాగునీటి సరఫరా, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, రోడ్లు, అర్బన్ ప్లానింగ్ రంగాల్లో సమగ్ర ప్రణాళికలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ మల్లు నర్సింహారెడ్డి, ముడా చైర్మెన్ లక్ష్మణ్ యాదవ్, నగర డిఫ్యూటీ మేయర్ సురేందర్ రెడ్డి, సిరాజ్ ఖాద్రీ పాల్గొన్నారు.

Next Story