- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అలంపూర్ అభివృద్ధికి రూ.15 కోట్ల నిధులు
దిశ, అలంపూర్ టౌన్ : అలంపూర్ పురపాలక అభివృద్ధి కొరకు రూ. 15 కోట్లు విడుదలైనట్లు టెలికామ్ అడ్వైజరి కమిటీ మెంబర్ ఇస్మాయిల్ తెలిపారు. అలంపూర్ లో పెండింగ్ లో ఉన్న

దిశ, అలంపూర్ టౌన్ : అలంపూర్ పురపాలక అభివృద్ధి కొరకు రూ. 15 కోట్లు విడుదలైనట్లు టెలికామ్ అడ్వైజరి కమిటీ మెంబర్ ఇస్మాయిల్ తెలిపారు. అలంపూర్ లో పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేసేందుకు ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ చొరవతో రాష్ట్ర ప్రభుత్వం రూ.15 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించారు. అలంపూర్ పట్టణంలోని ఆర్డీఎస్ కార్యాలయం నుంచి పాత రిజిస్ట్రేషన్ కార్యాలయం వరకు రోడ్డు విస్తరణ &డివైడర్ సెంట్రల్ లైటింగ్, అలాగే వర్షపు నీటితో ఇబ్బంది పడుతున్న అక్బర్ పేట కాలనీలో నూతన సీసీ రోడ్డు మంజూరు, అక్బర్ పేట కాలనీ నుండి పాపనాశి ఆలయానికి వెళ్లే దారిలో ఉన్న వాగు పై నూతన బ్రిడ్జి, అలంపూర్ పట్టణంలోని ప్రధాన సర్కిల్ విస్తరణ, సుందరీకరణ వంటి పనుల కోసం రూ.15కోట్లు వినియోగించనున్నట్లు ఇస్మాయిల్ తెలిపారు. నిధుల మంజూరుకు చొరవ చూపిన మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కు టెలికాం అడ్వైజరీ కమిటీ మెంబర్ ఇస్మాయిల్ కృతజ్ఞతలు తెలిపారు.






