126 సెల్ ఫోన్లు రీక‌వ‌రీ.. రూ.20ల‌క్ష‌ల‌కు పైగానే..!

by Nallavelli.Anjaneyulu |

దిశ‌, కంద‌నూల్ : నాగర్ కర్నూల్ జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలోని పట్టణాలు, గ్రామాల్లో మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న 126 మందికి 126 సెల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు జిల్లా

126 సెల్ ఫోన్లు రీక‌వ‌రీ.. రూ.20ల‌క్ష‌ల‌కు పైగానే..!
X

దిశ‌, కంద‌నూల్ : నాగర్ కర్నూల్ జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలోని పట్టణాలు, గ్రామాల్లో మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న 126 మందికి 126 సెల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల‌ సమావేశంలో ఎస్పీ వివరాలు వెల్లడించారు. జిల్లాలో ఇప్పటి వరకు 4487 సెల్ ఫోన్లు పోగొట్టుకున్నట్లు ఫిర్యాదులు అందాయని, అందులో నుంచి ఇప్పటి వరకు దాదాపు 1631 ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేసినట్లు తెలిపారు. ప్రజలు తమ విలువైన ఫోన్లు ఎక్కడైనా పోతే వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని, సీఈఐఆర్ ఆన్ లైన్ పోర్టల్లో ఫిర్యాదు నమోదు చేసుకోవాలని ఎస్పీ సూచించారు. ఫిర్యాదు చేయడం వల్ల ఎప్పుడైనా సెల్ ఫోను దొరుకుతుందన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు రికవరీ చేసిన మొత్తం ఫోన్ల విలువ 2 కోట్ల 50 లక్షల రూపాయలు ఉంటుందని ఎస్పీ తెలిపారు. విలేక‌ర్ల స‌మావేశంలో అడిషనల్ ఎస్పీ ఎన్ వెంకటేశ్వర్లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Next Story