- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎకరాకు 12 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేయాలి : రైతు సంఘం నాయకులు
దిశ, ఉండవెల్లి : మండలంలోని వరసిద్ధి వినాయక పత్తి మిల్ లో సీసీఐ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు కానీ రైతులు పండించిన పత్తి పంటను కొనుగోలు చేయాలని తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు నిరసన కార్యక్రమం మంగళవారం

దిశ, ఉండవెల్లి : మండలంలోని వరసిద్ధి వినాయక పత్తి మిల్ లో సీసీఐ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు కానీ రైతులు పండించిన పత్తి పంటను కొనుగోలు చేయాలని తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు నిరసన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు జి.కే. ఈదన్న మాట్లాడుతూ ప్రభుత్వం CCIకొనుగోలు ద్వారా ఎకరాకు కేవలం 7 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేయడం రైతులను మోసం చేయడమేనని విమర్శించారు. వాతావరణం అనుకూలించకపోవడంతో పత్తిలో తేమ శాతం పేరుతో తక్కువ ధర చెల్లించడం అన్యాయమని చెప్పారు. ఆన్లైన్ స్లాట్ బుకింగ్‌లో అవకతవకలు, రైతులకు అవగాహన లేకపోవడం వల్ల రైతులు కష్టాలు చూడాల్సిన దుస్థితి నెలకొన్నదని అన్నారు. ప్రభుత్వం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. నిన్నటి రైతుల ధర్నాకు దిగివచ్చిన అధికారులు 12క్వింటాలు కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చిన 24గంటలలో 7క్వింటాలు కొనుగోలు చేయడం ఏమిటని ప్రశ్నించారు.ప్రభుత్వం 7క్విటళ్ల నిర్ణయాన్ని పునఃపరిశీలించి ఎకరాకు 12 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేయాలని, లేకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.






