- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కుక్కల దాడిలో 12 గొర్రె పిల్లలు మృతి..
by Taduka Kalyani |
వీధి కుక్కల దాడిలో 12 గొర్రె పిల్లలు మృతి చెందిన ఘటన మంగళవారం జడ్చర్ల మండల పరిధి పెద్దపల్లి గ్రామంలో జరిగింది.

X
దిశ, జడ్చర్ల: వీధి కుక్కల దాడిలో 12 గొర్రె పిల్లలు మృతి చెందిన ఘటన మంగళవారం జడ్చర్ల మండల పరిధి పెద్దపల్లి గ్రామంలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి. పెద్దపల్లి గ్రామానికి చెందిన గొర్రెల కాపరులు నాగసాల సోమయ్య, గున్న శ్రీనివాసులు, గూడపు తిరుపతయ్యలు వ్యవసాయ పొలంలో గొర్రెల దొడ్డి వద్ద గొర్రె పిల్లలను జల్లలో వేసి గొర్రెలను మేపడానికి వెళ్లారు. కాగా మంగళవారం సాయంత్రం వీధి కుక్కలు గొర్రె పిల్లలు ఉన్న జల్ల వద్దకు వచ్చి అందులో ఉన్న 12 గొర్రె పిల్లలను చంపేశాయి. చనిపోయిన గొర్రె పిల్లల విలువ సుమారు రూ. 25000 ఉంటుందని రైతులు తెలిపారు. వీధి కుక్కల నివారణకు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని బాధితులు కోరుతున్నారు.
Next Story






