- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పకడ్బందీగా పదవ తరగతి పరీక్షలు నిర్వహించాలి
మాల్ ప్రాక్టీస్ కు తావివ్వకుండా పకడ్బందీగా పదవ తరగతి పరీక్షలు నిర్వహించాలని అదనపు కలెక్టర్ పి అమరేందర్ అధికారులను ఆదేశించారు.

దిశ, నాగర్ కర్నూల్ : మాల్ ప్రాక్టీస్ కు తావివ్వకుండా పకడ్బందీగా పదవ తరగతి పరీక్షలు నిర్వహించాలని అదనపు కలెక్టర్ పి అమరేందర్ అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో.. నిర్వహించిన చీఫ్ సూపరింటెండెంట్ లు, డిపార్టుమెంటు అధికారుల సమావేశానికి జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రమేష్ కుమార్ తో కలిసి అదనపు కలెక్టర్ పి అమరేందర్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12-30 వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పరీక్ష హాలులోకి సెల్ ఫోన్లను ఎలక్ట్రానిక్ గూడ్స్, గడియారాలు అనుమతించడం జరిగిందని తెలిపారు. ఈ పరీక్షలో జిల్లా ను రాష్ట్ర స్థాయి ఉత్తీర్ణతలో 10వ స్థానంలోపే వచ్చేలా కృషి చేయాలని సూచించారు. జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రమేష్ కుమార్ మాట్లాడుతూ..పదవ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించడంలో చీఫ్ సూపరింటెండెంట్లు ప్రధాన బాధ్యత వహించాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 60 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, వాటిలో మొత్తం 10598 మంది విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నట్లు తెలిపారు. రాష్ట్ర స్థాయిలో జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేలా కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో కలెక్టరేట్ ఏవో చంద్రశేఖర్, ప్రభుత్వ పరీక్షల నిర్వహణ అధికారి రాజశేఖర్‌రావు, నోడల్ అధికారి కుర్మయ్య, సెక్టోరియల్ అధికారులు షర్ఫుద్దీన్, వెంకటయ్య పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.






