ఈ దారి బాగు చేయండి..!

by Nallavelli.Anjaneyulu |

దిశ, అలంపూర్ : మానోపాడు మండల కేంద్రం నుంచి చెన్నిపాడు పోతులపాడు గ్రామాల మీదుగా కర్నూలుకు వెళ్లే ప్రధాన రహదారి ఇది. ఈ రహదారి మొత్తం పూర్తిగా పాడైపోయింది.

ఈ దారి బాగు చేయండి..!
X

దిశ, అలంపూర్ : మానోపాడు మండల కేంద్రం నుంచి చెన్నిపాడు, పోతులపాడు గ్రామాల మీదుగా కర్నూలుకు వెళ్లే ప్రధాన రహదారి ఇది. ఈ రహదారి మొత్తం పూర్తిగా పాడైపోయింది. ఇటువైపు ప్రయాణం చేయాలంటే ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులకు గుర‌వుతున్నారు. దాదాపు 20 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ రోడ్డు ఇది. పెద్ద పెద్ద గుంతలు, గోతులు పడి కంకర రాళ్లతో ప్రమాదకరంగా మారింది. అధికారులకు ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని గ్రామస్తులు మండిపడుతున్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం ప్రతి నాయకుడు మీ రోడ్డును బాగో చేస్తామని చెప్పి చేతులు దులుపుకుంటున్నారు. ఎన్నిక‌లు ముగిసిన త‌రువాత ఇటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదని చెన్నిపాడు గ్రామస్తులు మండిపడుతున్నారు.

జిల్లా కలెక్టర్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కి చెన్నిపాడు, పోతులపాడు గ్రామస్తులు ఇప్పటికే మూడుసార్లు వినతి పత్రం అందించారు. కానీ ఈ రోడ్డు వైపు ఒక్క అధికారి కూడా కన్నెత్తి చూసిన దాఖలాలు లేకపోలేదు. ఈ గ్రామం వైపు 108 వాహనాలు రావాలన్న కూడా ఇబ్బందులు పడక త‌ప్ప‌డం లేదు. రోడ్డు బాగోలేక‌పోవ‌డంతో ఒక్కోసారి అంబులెన్స్ లు కూడా రావ‌డం లేదు. రెండు కిలోమీటర్ల రహదారికి గోతులు, పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. గత ఏడాది ప్యాచ్ వర్క్ చేస్తామని.. నామమాత్రంగా రెండు మూడు చోట్ల గుంతలను పూడ్చి పది లక్షల వరకు డబ్బులు స్వాహా చేశారని గ్రామస్తులు మండిపడుతున్నారు. ప్యాచ్ వర్క్ లైన్ పూర్తిగా చేసి ఉంటే మాకు ఈ పరిస్థితి ఉండేది కాదని... ఈ రోడ్డును చూస్తే మళ్ళీ 20 ఏళ్ల వెనక్కి వెళ్లినట్లు కనిపిస్తుందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా ప్రజా పాలకులు అధికారులు స్పందించి మా రోడ్డుకు నిధులు మంజూరు చేసి రోడ్డు వేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. రోడ్డు వేసేంత వ‌ర‌కు ప్యాచ్ వ‌ర్క్ చేసి మా ప్ర‌యాణానికి ఆటంకం క‌లుగ‌కుండా చూడాల‌ని ప్ర‌జ‌లు కోరుతున్నారు.

Next Story