- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Maganti: వీళ్లను లోనికి రానివ్వకండి.. ఆసుపత్రిలో ఉండగా మాగంటి కూతురు లేఖ.. కాంగ్రెస్ సూటి ప్రశ్న
కన్న తల్లినీ.. సొంత వారినీ ఎంఐసీయూలోకి రానివ్వకుండ నియంత్రించడంపై కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తోంది.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (Maganti Gopinath) ఫ్యామిలీ వ్యవహారం రోజు రోజుకు కొత్త మలుపులు తిరుగుతోంది. గోపీనాథ్ మరణం వెనుక భారీ కుట్ర కోణం ఉందని ఆయన తల్లి మాగంటి మహానంద కుమారి ఆరోపణలు చేస్తున్న వేళ మాగంటి గోపీనాథ్ చికిత్స పొందిన గచ్చిబౌలి ఏఐసీ ఆసుపత్రిలో జరిగిన పరిణామాలు సంచలనం రేపుతున్నాయి. గోపీనాథ్‍కు చికిత్స అందుతున్న సమయంలో గోపీనాథ్ తల్లి మానంద కుమారి, మాగంటి సోదరుడు వజ్రనాథ్‍తో పాటు పలువురు బంధువులను ఎంఐసీయూలోకి రానివ్వకూడదని ఆసుపత్రి సెక్యురీటీ సిబ్బందికి సునీత కుతురు దిశిరా లేఖ రాయడం సంచలనంగా మారింది. ఈ లేఖ ప్రకారం మాగంటి గోపినాథ్ గోప్యత, భద్రత, నిరంతర వైద్య చికిత్స నేపథ్యంలో అనుషా, అశిత, వజ్రనాథ్, మహానంద కుమారి, ఇందుమతిని ఎట్టి పరిస్థితుల్లోని ఎంఐసీయులోకి అనుమతి ఇవ్వకూడదంటూ దిశిరా (Dishira letter) ఎంఐసీయూ సెక్యురిటీ ఇన్ చార్జికి ఈ ఏడాది జూన్ 6వ తేదీన రాసినట్లుగా ఉన్న లేఖ ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ లేఖను ఎక్స్ వేదికాగ పోస్టు చేస్తూ టీపీసీసీ మీడియా కమ్యూనికేషన్ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆసుపత్రిలో మాగంటి మరణం వెనుక అనుమానాలు జవాబు లేని ప్రశ్నలు ఉన్నాయని కన్నతల్లినీ, సొంత వారిని ఎంఐసీయులోకి రానివ్వకుండా మాగంటి గోపీనాథ్ ను చూడనివ్వకుండా నియంత్రించడం ఏమిటని సామ రామ్మోహన్ ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత జవాబు చెబుతారా లేదా? కేటీఆర్ జవాబు చెప్తారా అని ప్రశ్నించారు.






