- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జూబ్లీహిల్స్ ఓటర్లకు మాగంటి సునీత వీడియో సందేశం
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక(Jubilee Hills By-Election) పోలింగ్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత సోషల్ మీడియా వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక(Jubilee Hills By-Election) పోలింగ్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత సోషల్ మీడియా వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా వీడియో విడుదల చేశారు. ‘‘జూబ్లీహిల్స్ ప్రజలారా.. మీకు నా విన్నపం.. కుటుంబ పెద్దను కోల్పోయి, పుట్టెడు దు:ఖంలో ఉన్నప్పటికీ.. మమ్మల్నే నమ్ముకున్న ప్రజలకు అండగా నిలబడాలనే ఉద్దేశ్యంతో కేసీఆర్ ఆశీస్సులతో జూబ్లీహిల్స్‌లో పోటీ చేస్తున్నాను. ఎన్ని ఆటంకాలు ఎదురైనా మొండి ధైర్యంతో ముందుకెళ్తున్న మీ ఆడబిడ్డను గెలిపించుకోవాలంటే నవంబర్ 11న జరిగే ఉప ఎన్నికలో సీరియల్ నంబర్-3పై నొక్కి కారు గుర్తుకు ఓటేయాలని.. గోపన్న ఆశయాల్ని నెరవేర్చే అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను’’ అని మాగంటి సునీత పేర్కొన్నారు. బీఆర్ఎస్ సిట్టింగ్ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో ఖాళీ అయిన ఈ స్థానాన్ని దక్కించుకోవడానికి మూడు ప్రధాన పార్టీలు హోరాహోరీ ప్రచారం చేశాయి. ఈనెల 11న మంగళవారం జరిగే ఎన్నికలకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. జూబ్లీహిల్స్‌లో మొత్తం 58 మంది అ భ్యర్థులు బరిలో నిలిచారు. 4.01 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరి కోసం 407 పోలింగ్ కేంద్రాల్లో, ఒక్కోచోట సగటున 986 ఓట ర్లు ఉండే విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. వీడియో






