సామాజిక న్యాయానికి సమాధి కట్టిందే కాంగ్రెస్: మాజీ స్పీకర్ మధుసూదనాచారి

by Ajay Maddhiboyina |

సామాజిక న్యాయానికి సమాధి కట్టిందే కాంగ్రెస్ పార్టీ అని.. 1970, 1980లలో కేంద్రంలో సగం మంది మంత్రులు ఒకే సామాజిక వర్గం వారు ఉన్నారని.. సీఎంలు గవర్నర్లు కూడా కాంగ్రెస్‌లో

సామాజిక న్యాయానికి సమాధి కట్టిందే కాంగ్రెస్: మాజీ స్పీకర్ మధుసూదనాచారి
X

దిశ, తెలంగాణ బ్యూరో: సామాజిక న్యాయానికి సమాధి కట్టిందే కాంగ్రెస్ పార్టీ అని.. 1970, 1980లలో కేంద్రంలో సగం మంది మంత్రులు ఒకే సామాజిక వర్గం వారు ఉన్నారని.. సీఎంలు గవర్నర్లు కూడా కాంగ్రెస్‌లో ఒకే సామాజిక వర్గం వారు ఉండేవారని శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి ఆరోపించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఇప్పుడు సామాజిక న్యాయాన్ని కాంగ్రెస్ తుంగలో తొక్కిందని ఆరోపించారు. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో చిలక పలుకులు పలికించారని అన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా సామాజిక న్యాయానికి కాంగ్రెస్ ప్రభుత్వం తూట్లు పొడిచిందన్నారు. ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌లో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదన్నారు. ఖర్గే మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో కులగణన తూతూ మంత్రంగా తప్పుల తడకగా జరిగిందని అన్నారు. బీసీ బిల్లును ఆమోదించి ఢిల్లీ పంపిన తర్వాత కూడా ఎలాంటి పురోగతి లేదన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పై చేయాల్సినంత ఒత్తిడి చేయడం లేదని ఆరోపించారు. సీఎం మాటలు, మోసాలు కోటలు దాటుతున్నాయని.. ఆచరణ గడప దాటడం లేదని అన్నారు. కాంగ్రెస్ నయా నాటకాన్ని ప్రజలకు వివరిస్తామన్నారు.

Next Story