నిన్ను కనేముందు మీ నాన్న కండోమ్ వాడాల్సింది.. యూట్యూబర్‌ అన్వేష్‌పై మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

by Ramesh Naini |   (  Updated:2026-05-16 18:04:54  IST  )

ప్రముఖ యూట్యూబర్, ‘నా అన్వేషణ’ ఫేమ్ అన్వేష్‌పై నటి, బీజేపీ నాయకురాలు మాధవీలత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

నిన్ను కనేముందు మీ నాన్న కండోమ్ వాడాల్సింది.. యూట్యూబర్‌ అన్వేష్‌పై మాధవీలత సంచలన వ్యాఖ్యలు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ యూట్యూబర్, ‘నా అన్వేషణ’ ఫేమ్ అన్వేష్‌పై నటి, బీజేపీ నాయకురాలు మాధవీలత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇటీవల అన్వేష్ ఓ ఆధ్యాత్మిక గురువును (జగద్గురువు) ఉద్దేశించి చేసిన ఎగతాళి చేస్తూ వ్యాఖ్యలు చేశారని ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాల వేదికగా ఆమె చేసిన అత్యంత ఘాటు వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట తీవ్ర దుమారం రేపుతున్నాయి.

బోల్డ్ పదజాలంతో విమర్శలు..

సనాతన ధర్మాన్ని, పీఠాధిపతులను కించపరిచేలా మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని మాధవీలత స్పష్టం చేశారు. జగద్గురువును అవమానించడాన్ని తీవ్రంగా పరిగణించిన ఆమె, లైవ్ వీడియోలో మాట్లాడుతూ ఏమాత్రం సంకోచించకుండా బోల్డ్ పదజాలాన్ని ఉపయోగించారు. ‘నిన్ను కనేముందు మీ నాన్న కండోమ్ వాడి ఉంటే.. ఈ రోజు సమాజానికి ఈ దరిద్రం వదిలేది’ అంటూ అన్వేష్‌ను ఉద్దేశించి ఆమె చేసిన తీవ్ర వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

కర్మ అనుభవించక తప్పదు..

పవిత్రమైన ఆధ్యాత్మిక గురువులను తక్కువ చేసి మాట్లాడటం అన్వేష్ అహంకారానికి నిదర్శనమని ఆమె మండిపడ్డారు. ‘నువ్వు ఎంతటి వాడివైనా సరే.. జగద్గురువుపై చేసిన వ్యాఖ్యలకు త్వరలోనే కర్మ అనుభవిస్తావు. దేవుడి స్క్రిప్ట్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది, నీ పతనం త్వరలోనే చూస్తావు’ అంటూ ఆమె గట్టిగా హెచ్చరించారు. కాగా, ‘నచ్చావులే’, ‘స్నేహితుడా’ వంటి చిత్రాలతో టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న మాధవీలత, కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ముఖ్యంగా హిందూ ధర్మం, సామాజిక అంశాలపై ఎవరైనా అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే ఆమె వెంటనే స్పందిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజా వివాదంతో అటు అన్వేష్ అభిమానులకు, ఇటు మాధవీలత మద్దతుదారులకు మధ్య సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున మాటల యుద్ధం నడుస్తోంది. ఈ పరిణామం ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Next Story