కరీంనగర్‌లో ఎన్నికల సిబ్బందిపై పిచ్చి కుక్కల దాడి

by Gantepaka Srikanth |

మున్సిపల్ ఎన్నికల పోలింగ్ వేళ కరీంనగర్ జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.

కరీంనగర్‌లో ఎన్నికల సిబ్బందిపై పిచ్చి కుక్కల దాడి
X

దిశ, వెబ్‌డెస్క్: మున్సిపల్ ఎన్నికల పోలింగ్(Telangana Municipal Elections Polling) వేళ కరీంనగర్ జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఎన్నికల సిబ్బంది పై పిచ్చి కుక్కలు దాడి చేశాయి. ఎన్నికల పోలింగ్‌ కేంద్రం ప్రాంగణంలో ఉన్న ఎన్నికల సిబ్బందిపై దాడి చేసిన రెండు పిచ్చి కుక్కలు అటాక్ చేశాయి. ఈ దాడిలో ముగ్గురు అధికారులు గాయపడ్డారు. గాయపడినవారికి అక్కడే ఉన్న వైద్య శిబిరంలో ప్రాథమిక చికిత్స చేయించి.. వ్యాక్సిన్‌ ఇప్పించి ఇంటికి పంపించారు. మరోవైపు ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 5 గంటల వరకూ సాగుతుంది. మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల పరిధిలో ఈ మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. 14 వార్డులు ఏకగ్రీవం కాగా.. ఒక వార్డుకు ఎన్నిక వాయిదా పడింది.

మొత్తం 12,944 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. వారి భవిష్యత్తును తేల్చేందుకు 52.43 లక్షల మంది ఓటర్లు రెడీ అయ్యారు. వారికోసం 16,031 బ్యాలెట్ బాక్సులు సిద్ధంగా ఉన్నాయి. ఓటర్లు ఎన్నికల సంఘం సూచించిన 12 రకాల గుర్తింపు పత్రాల్లో ఏదైనా ఒకటి వెంట తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే సమస్యాత్మక ప్రాంతాల్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. అలాంటి ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, వెబ్ కాస్టింగ్ సౌకర్యం కూడా కల్పించారు. ముక్తల్ మున్సిపాలిటీలో 6వ వార్డులో బీజేపీ అభ్యర్థి అనుమానాస్పద స్థితిలో చనిపోవడంతో ఆ స్థానానికి ఎన్నికను వాయిదా వేశారు. ఈ నెల 13న ఓట్ల లెక్కింపు ఉంటుంది. అదే రోజు ఫలితాలు వెల్లడించే ప్లాన్ ఉంది.

Next Story