Hyd: నడిరోడ్డుపై యువతుల్ని వేధించిన కామాంధుడు

by velandi.Saikiran |   (  Updated:2026-01-02 21:45:57  IST  )

నడిరోడ్డుపై యువతుల్ని వేధించాడు ఓ కామాంధుడు. హైదరాబాద్‌లోని ఆల్విన్ ఎక్స్ రోడ్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.

Hyd: నడిరోడ్డుపై యువతుల్ని వేధించిన కామాంధుడు
X

దిశ‌, వెబ్ డెస్క్‌: దేశంలోని కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఎన్ని క‌ఠిన రూల్స్ తీసుకొచ్చినా, మ‌హిళ‌ల‌పై దాడులు ఆగ‌డం లేదు. రోజు రోజుకు కామాంధులు రెచ్చిపోతున్నారు. అయితే, తాజాగా హైద‌రాబాద్ లో మ‌రో దారుణం జ‌రిగింది. నడిరోడ్డుపై యువతుల్ని వేధించాడు ఓ కామాంధుడు. హైదరాబాద్‌లోని ఆల్విన్ ఎక్స్ రోడ్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.

ఇద్దరు యువతులు సినిమా చూసి తిరిగి తమ ఇంటికి వెళ్తుండగా.. వారిని వెంబడించాడు ఓ మధ్య వయస్కుడు. హైద‌రాబాద్ లోని ఓ సిగ్నల్ వద్ద ఆగినప్పుడు వారి పట్ల అసభ్యకర రీతిలో సైగలు చేస్తూ.. తన బైక్ ఎక్కమంటూ వేధించాడు స‌ద‌రు వ్యక్తి. ఎంత నిరాకరించినా పదే పదే వెంబడిస్తుండటంతో.. ఫోన్‌లో వీడియో రికార్డ్ చేసి నెట్టింట్లో పోస్ట్ చేశారు ఆ యువ‌తులు. గతేడాది అక్టోబర్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన.. ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మ‌రి దీనిపై పోలీసులు చ‌ర్య‌లు తీసుకుంటారా? లేదా ? అనేది చూడాలి. క్లిక్

Next Story