యాదగిరిగుట్ట ఆలయానికి తప్పిన LPG సెగ.. ఈవో విజ్ఞప్తికి HPCL గ్రీన్ సిగ్నల్

by Kema Shiva Kumar |

యాదగిరిగుట్ట ఆలయానికి గ్యాస్‌ సరఫరా ఆపొద్దని ఈవో చేసిన విజ్ఞప్తికి హెచ్‌పీసీఎల్‌ సానుకూలంగా స్పందించింది.

యాదగిరిగుట్ట ఆలయానికి తప్పిన LPG సెగ.. ఈవో విజ్ఞప్తికి HPCL గ్రీన్ సిగ్నల్
X

దిశ, వెబ్‌డెస్క్: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ప్రసాదాల తయారీ, నిత్య అన్నదాన కార్యక్రమాలకు సంబంధించి ఎదురవుతున్న గ్యాస్ సరఫరా సమస్య పరిష్కారమైంది. ఆలయ అవసరాలకు గ్యాస్‌ సరఫరాను నిలిపివేయవద్దని కోరుతూ యాదగిరిగుట్ట దేవస్థానం కార్యనిర్వహణాధికారి (EO) హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) సంస్థకు రాసిన లేఖకు సానుకూల స్పందన విచ్చింది.

ప్రతి నెలా 3.5 టన్నుల గ్యాస్‌ వినియోగం..

దేవస్థానంలో భక్తుల రద్దీ దృష్ట్యా నిత్యం భారీగా ప్రసాదాల తయారీ జరుగుతుంటుంది. గ్యాస్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలని, సరఫరాను కొనసాగించాలని ఈవో హెచ్‌పీసీఎల్‌ను కోరారు. దీనిపై స్పందించిన సంస్థ యాజమాన్యం, దేవస్థానానికి గ్యాస్ సరఫరాను నిరంతరాయంగా కొనసాగిస్తామని హామీ ఇచ్చింది. అయితే, యాదగిరిగుట్ట ఆలయంలో ప్రతి నెలా సగటున 3.5 టన్నుల గ్యాస్‌ వినియోగం జరుగుతోంది. లడ్డూ ప్రసాదం తయారీతో పాటు ఇతర కైంకర్యాలకు గ్యాస్ వినియోగం తప్పనిసరి. ప్రస్తుతం దేవస్థానంలో ఎటువంటి కొరత లేదని, రాబోయే రెండు నెలలకు సరిపడా గ్యాస్ నిల్వలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయని అధికారులు స్పష్టం చేశారు. హెచ్‌పీసీఎల్ సానుకూలంగా స్పందించడంతో భక్తులకు ప్రసాదాల పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని దేవస్థానం వర్గాలు వెల్లడించాయి.

Next Story