- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Good News: గ్యాస్ వినియోగదారులకు మరో శుభవార్త.. త్వరలో ఆ ఇబ్బందులకు చెక్
ఎల్పీజీ పంపిణిదారుతో ఇబ్బందులు పడుతున్న వినియోగదారులకు త్వరలోనే ఆ ఇబ్బందులు తప్పనున్నాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: గ్యాస్ సిలిండర్ వాడుతున్నారా? మీ ఎల్పీజీ సప్లయర్ తో ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీకు శుభవార్త. త్వరలోనే ఈ సమస్యకు చెక్ పెట్టేలా పెట్రోలియం మరియు సహజ వాయువు నియంత్రణ బోర్డు కసరత్తు చేస్తోంది. నచ్చని మొబైల్ నెట్ వర్క్ నుంచి ఇతర నెట్ వర్క్ కు పోర్టబుల్ అయినట్లుగానే ఇకపై వంట గ్యాస్ వినియోగదారులు తమ ప్రస్తుత కనెక్షన్‍ను మార్చకుండానే తమ సరఫరాదారుని మార్చుకునే వీలు కల్పించేలా ఎల్పీజీ పోర్టబులిటీని (LPG portability) అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. ఈ మేరకు ఈ ప్రతిపాదనపై అభిప్రాయాలు స్వీకరించేందుకు పెట్రోలియం, నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు (PNGRB) నోటీసు విడుదల చేసింది. పీఎన్జీఆర్బీ తెలిపిన ప్రకారం స్థానిక డిస్ట్రిబ్యూటర్‌కు సాంకేతిక లేదా నిర్వహణ సమస్యలు ఉన్నప్పుడు వినియోగదారులకు ప్రత్యామ్నాయాలు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా ఎల్పీజీ ఇంటరాపరబిలిటీ ఫ్రేమ్‌వర్క్ ను తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోందని తెలిపింది. ఈ విధానం అందుబాటులోకి వస్తే వినియోగదారులకు మరిన్ని ఎంపికలు, మెరుగైన సేవలను అందుబాటులోకి రానున్నాయి.






