ఉపరితల ద్రోణి, అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు

by Naga Rani Yarlagadda |

ఉపరితల ద్రోణి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో (Bay of Bengal) కొనసాగుతున్న అల్పపీడనం (Low Pressure) ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

ఉపరితల ద్రోణి, అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఉపరితల ద్రోణి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో (Bay of Bengal) కొనసాగుతున్న అల్పపీడనం (Low Pressure) ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ అల్పపీడనం మరింత బలపడి పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ.. గురువారం తెల్లవారుజామున వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు తెలిపింది. దీని ప్రభావంతో నేడు కోస్తాంధ్ర, తెలంగాణ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్ (Yellow Alert) జారీ చేశారు. అక్టోబర్ 3వ తేదీన దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తాల మధ్య తీరం దాటనుండగా.. గురు, శుక్రవారాల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. వర్షాల సమయంలో 30 కిలోమీటర్లకు పైగా ఈదురుగాలులు వీస్తాయని, చెట్లు, హోర్డింగులకు సమీపంలో ఉండవద్దని ప్రజలకు సూచించారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు 5 రోజుల వరకూ వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.

Next Story