- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Bars: వాళ్లకే ఎక్కువగా దక్కిన బార్లు! ప్రశాంతంగా ముగిసిన డ్రా.. రాష్ట్ర వ్యాప్తంగా 28 బార్లకు లాటరీ
రాష్ట్రవ్యాప్తంగా 28 బార్ల పునరుద్ధరణకు ఇవాళ ఆబ్కారీ శాఖ లాటరీ తీసింది.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా 28 బార్ల పునరుద్ధరణకు ఇవాళ (Excise Department) ఆబ్కారీ శాఖ లాటరీ (Bars lottery) తీసింది. జీహెచ్ఎంసీ పరిధిలోని 24 బార్లకు, మిగిలిన జిల్లాల్లోని 4 బార్లకు డ్రా (draw) ప్రశాంతంగా ముగిసింది. ఈ డ్రా లో బార్లను ఎక్కువగా నల్గొండ, హైదరాబాద్ జిల్లాలకు చెందివారు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం నార్సింగ్‌లోని ది అడ్రస్ కన్వెన్షన్స్ అండ్ ఎగ్జిబిషన్స్ హాల్లో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ సి. హరి కిరణ్ చేతుల మీదుగా లాటరీ పద్ధతి ద్వారా లబ్దిదారులను ఎంపిక చేశారు.
జీహెచ్ఎంసీలోని 24 బార్లకు 3,520 దరఖాస్తులు రాగా.. మిగతా జిల్లాల్లోని నాలుగు బార్లకు 148 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో భాగంగా రెండు బార్లకు అప్లికేషన్ వేసినోళ్లకి ఒకటి దక్కడం విశేశం. ఒక సింగ్ వ్యక్తి 148 వేస్తే ఒకటి మాత్రమే దక్కడం గమనార్హం. మొత్తం 28 బార్లకు గానూ.. 3,668 దరఖాస్తులు రావడంతో ఎక్సైజ్ శాఖకు 36.68 కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. కాగా, డ్రా తీయడానికి ముందు అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం ప్రమాద మృతులకు రెండు నిమిషాలు మౌనం పాటించి ఎక్సైజ్ శాఖ నివాళులు అర్పించింది.






