- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమ్మాయిల ముందు పరువు పోయిందిగా! ఒక చెంప దెబ్బ ఎక్స్‌ట్రా? సీపీ సజ్జనార్ ట్వీట్ వైరల్
ఓ యువకుడు పెట్రోల్ బంక్ వద్ద ఓవర్ యాక్షన్ చేశాడు. అమ్మాయిల ముందు బిల్డప్ కోసం ప్రమాదకరంగా బైక్ స్టంట్ చేసి చివరికి ఒక చెంప దెబ్బ తినాల్సిన పరిస్థితి వచ్చింది.

దిశ, డైనమిక్ బ్యూరో: ఓ యువకుడు పెట్రోల్ బంక్ వద్ద ఓవర్ యాక్షన్ చేశాడు. అమ్మాయిల ముందు బిల్డప్ కోసం ప్రమాదకరంగా బైక్ స్టంట్ చేసి చివరికి ఒక చెంప దెబ్బ తినాల్సిన పరిస్థితి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో మంగళవారం ఎక్స్ వేదికగా హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ట్వీట్ చేయడంతో వైరల్‌గా మారింది. ‘వినాశకాలే విపరీత బుద్ధి అని పెద్దలు ఊరికే అనలేదు. పెట్రోల్ బంక్ లాంటి అత్యంత ప్రమాదకరమైన ప్రదేశంలో అమ్మాయిలను ఇంప్రెస్ చేయడానికి బైక్ స్టంట్లు చేయడం సాహసం కాదు.. అది పచ్చి మూర్ఖత్వం. మీ ఒక్క క్షణపు షో కోసం అక్కడ ఉన్న అమాయకుల ప్రాణాలు బలి కావాలా? గుర్తుంచుకోండి.. మీరు చేసే Wheelings ఇంట్లో మీ కోసం ఎదురుచూసే తల్లిదండ్రుల కళ్లలో కన్నీటి Feelings మిగల్చకూడదు. బాధ్యతగా ఉండండి’ అని సజ్జనార్ ట్వీట్ షేర్ చేశారు.
ఇంతకీ వీడియోలో ఏముంది..?
వైరల్ వీడియో ప్రకారం.. పెట్రోల్ కోసం బైక్‌పై ఇద్దరు యువకులు బంకు వద్ద వస్తారు. అయితే అప్పటికే లైన్‌లో వారి ముందు ఉన్న ఓ వ్యక్తి బైక్‌లో పెట్రోల్ పోయిస్తుంటాడు. ఆయన పక్కనే ఇద్దరు యువతులు ఉంటారు. వారిని చూసిన ఆ బైకర్ స్టంట్ చేసే ప్రయత్నం చేస్తాడు. తీరా అది బెడిసికొట్టి గాల్లోకి బైక్ మొత్తం లేచి నిలబడుతుంది. ముందు పెట్రోల్ కొట్టిస్తున్న వ్యక్తికి ఆ బైక్ తగలడంతో బైక్‌ను అతను ఒక చెంపదెబ్బ కొడుతాడు. తర్వాత వారిని అక్కడున్న వారంత తిట్టి బైక్‌ను పక్కకు పంపిస్తారు. ఈ తతంగమంతా అక్కడే ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డు అవుతుంది. ఈ వీడియో సీపీ సజ్జనార్ పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. నెటిజన్‌లు వీడియోపై ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ‘అమ్మాయిల ముందు పరువు మొత్తం పోయిందిగా, మరోవైపు ఒక చెంప దెబ్బ ఎక్స్ ట్రా’ అంటూ ఓ నెటిజన్ చేసిన కామెంట్ హైలెట్‌గా నిలిచింది. ‘సార్ ఇలాంటి వాళ్ళని ఉపేక్షించకూడదు.. అదృష్టవశాత్తూ ఏం జరగలేదు.. ఏదైనా జరగరానిది జరిగితే భారీ నష్టం జరిగేది. ఎవరైనా సరే వెహికల్స్ పై వెళుతున్న సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి’ అని మరో నెటిజన్ కామెంట్ చేశారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లో జరిగిందని ఇంకో నెటిజన్ కామెంట్ పెట్టాడు.






