- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్థానిక ఎన్నికల అప్డేట్
by Muthe.Rajitha |
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి.

X
దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం తరపున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈమేరకు వార్డుల వారీగా రిజర్వేషన్లను ఖరారు చేసింది సర్కార్. ఇప్పటికే ఈ జాబితాను జిల్లాల కలెక్టర్లకు పంపించే ప్రక్రియ కూడా ప్రారంభం అయినట్టు తెలుస్తోంది. సాయంత్రం కల్లా ఈ ప్రక్రియ పూర్తి కానుందని సమాచారం.
జనాభా నిష్పత్తిని బట్టి SC, ST, BC స్థానాలను కేటాయించింది ప్రభుత్వం. అయితే బీసీలకు 22 శాతం రిజర్వేషన్లను కలుపుకొని మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా అధికారులు జాగ్రత్త తీసుకుంటున్నట్టు సమాచారం. కాగా రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఒకటీ రెండు రోజుల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉండగా.. డిసెంబర్ రెండో వారంలో లేదా మూడో వారంలో జరిగే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు చెబుతున్నారు.
Next Story






