- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CM Revanth Reddy: నా జీవితంలో ఇది మరపురాని రోజు: సీఎం రేవంత్
2023 అసెంబ్లీ ఎన్నికల్లో రైతులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రుణమాఫీ హామీకి బుధవారం శ్రీకారం చుట్టింది.

దిశ, వెబ్ డెస్క్: 2023 అసెంబ్లీ ఎన్నికల్లో రైతులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రుణమాఫీ హామీకి బుధవారం శ్రీకారం చుట్టింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రూ. లక్షలోపు తీసుకున్న పంట రుణాలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు సాయంత్రం విడుదల చేసింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర సచివాలయంలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. నా జీవితంలో ఇది మరపురాని రోజని.. రైతులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నెరవేర్చి చూపించామని అన్నారు. అలాగే త్వరలోనే వరంగల్‌లో రైతులతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని.. ఎల్లుండి ఢిల్లీ వెళ్లి రాహుల్‌ని కలుసి.. వరంగల్ సభకు రాహుల్‌ని ఆహ్వానిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గత పది సంవత్సరాలలో బీఆర్ఎస్ పార్టీ చేయలేనిది తాము చేశామని.. రుణమాఫీపై కావాలనే కొంతమంది అపోహలు సృష్టిస్తున్నారని..ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రుణమాఫీ చేస్తున్నామని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.






