ఒక సమోసా తినేశారు.. రెండో సమోసా సగం కట్ చేయగా.. అందులో బల్లి!

by Gantepaka Srikanth |

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో షాకింగ్ ఘటన వెలుగుజూసింది. ఓ స్వీట్ షాప్ కొన్న సమోసా(Samosa)లో బల్లి ప్రత్యక్షమైంది.

ఒక సమోసా తినేశారు.. రెండో సమోసా సగం కట్ చేయగా.. అందులో బల్లి!
X

దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో షాకింగ్ ఘటన వెలుగుజూసింది. ఓ స్వీట్ షాప్ కొన్న సమోసా(Samosa)లో బల్లి ప్రత్యక్షమైంది. వివరాల్లోకి వెళితే.. తోల్కట్ట గేట్ సమీపంలోని దుకాణంలో కొందరు చిన్నారులు రెండు సమోసాలు కొన్నారు. ఓ సమోసా తిన్న తర్వాత రెండో సమోసాను తుంచగా అందులో బల్లి(Lizard) కనిపించింది. దీంతో షాకైన చిన్నారులు అక్కడే వాంతులు చేసుకున్నారు. వెంటనే స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న స్వీట్ షాప్ యజమాని షెటర్ లాక్ చేసుకుని పరారయ్యాడు. దీనిపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇలాంటి ఫుడ్ షాపులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. బయట ఫుడ్ తినాలంటేనే భయంగా ఉందని కూడా కామెంట్ చేస్తున్నారు.

Next Story