- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాజ్‌భవన్‌కు తెలంగాణ కొత్త మంత్రుల జాబితా
కొత్త మంత్రుల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం రాజ్‌భవన్(Raj Bhavan) కార్యాలయానికి పంపింది.

దిశ, వెబ్‌డెస్క్: కొత్త మంత్రుల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం రాజ్‌భవన్(Raj Bhavan) కార్యాలయానికి పంపింది. జాబితాలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్లు ఉన్నట్లు సమాచారం. సరిగ్గా ఇవాళ మధ్యాహ్నం 12:19 గంటలకు వీరు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వీరితో పాటు శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా రామచంద్రునాయక్‌ను ప్రభుత్వం(Congress Govt) ఎంపిక చేసినట్లు తెలిసింది. తాజా విస్తరణలో సామాజిక న్యాయాన్ని పరిగణనలోకి తీసుకుని ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలని అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, మంత్రివర్గ విస్తరణలో సుదర్శన్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిల పేర్లు మొదటి నుంచీ వినిపించినా ప్రస్తుత జాబితాలో కనిపించలేదు. ఎస్సీ, బీసీలకు మాత్రమే అవకాశం ఇవ్వాలని అధిష్టానం చెప్పిన నేపథ్యంలో వారికి మొండిచేయి ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే మాదిగ సామాజికవర్గంతోపాటు ఎస్టీల నుంచి కూడా ఒకరికి అవకాశం ఇవ్వాలని.. నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్‌రెడ్డికి కూడా చోటు కల్పించాలని ముఖ్యమంత్రి పట్టుబడుతున్నట్లు సమాచారం.






