- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
HYD: సీఎం రేవంత్ సవాల్ స్వీకరణ.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బస అక్కడే!
మూసీ(Musi) పరివాహక ప్రాంతాల్లో తెలంగాణ బీజేపీ(Telangana BJP) నేతలు నేడు బస చేయనున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: మూసీ(Musi) పరివాహక ప్రాంతాల్లో తెలంగాణ బీజేపీ(Telangana BJP) నేతలు నేడు బస చేయనున్నారు. ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి రేపు ఉదయం 9 గంటల వరకు బస చేయనున్నారు. రాత్రి భోజనంతో పాటు నిద్ర, ఆ మరుసటి రోజు అల్పహారం కూడా అక్కడే చేస్తున్నట్లు ప్రకటించారు. మొత్తం 20 ప్రాంతాల్లో 20 మంది నేతలు బస చేయబోతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సవాల్‌ను స్వీకరించి.. ఈ కార్యక్రమానికి టీ.బీజేపీ నేతలు పూనుకున్నారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో ప్రజల సమస్యలు తెలుసుకొని మనోధైర్యం ఇవ్వనున్నారు. అంబర్‌పేట్‌లోని తులసీరామ్ నగర్‌లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఓల్డ్ మలక్‌పేట్‌లోని శాలివాహననగర్‌లో ఎంపీ కే.లక్ష్మణ్, ఎల్బీనగర్‌లోని గణేష్ నగర్‌లో ఈటల రాజేందర్, రాజేంద్రనగర్‌లోని హైదర్‌కోట్‌లో కొండా విశ్వేశ్వర్ రెడ్డి, అఫ్జల్‌గంజ్‌లోని రెసిడెన్షియల్ హౌసింగ్ బస్తీలో బీబీ పాటిల్ బస చేయనున్నారు.






