- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Liquor bandh: 3 రోజుల పాటు మందు బంద్.. హైదరాబాద్ శివారులోని మందుబాబులకు షాక్
హైదరాబాద్ శివారులోని మందుబాబులకు షాకింగ్ న్యూస్.

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ (Hyderabad) సిటీ శివారు ప్రాంతాల్లో ఉంటే మందు బాబులకు షాకింగ్ న్యూస్. మూడు రోజుల పాటు మందు బంద్ కానుంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ (MLC Election Code) కారణంగా సిటీ శివారు ప్రాంతాల్లో బార్లు, వైన్ షాపులు మూసివేయనున్నారు. ఫిబ్రవరి 27న పోలింగ్ జరగనున్నది. ప్రజాప్రాతినిధ్యం చట్టం ప్రకారం ఫిబ్రవరి 25 ఉదయం 6 గంటల నుంచి ఫిబ్రవరి ఫిబ్రవరి 27 సాయంత్రం 6 గంటల వరకు కొల్లూరు, రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిల్లోని అన్ని కల్లు దుకాణాలు, వైన్ షాపులు, రెస్టారెంట్లకు అనుబంధంగా ఉన్న బార్ లు, స్టార్ హోటళ్లలోని బార్ లు, రిజిస్టర్డ్ క్లబ్బులు మూసివేయాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మహంతి ఆదేశాలు జారీ చేశారు.
కాగా తెలంగాణలో రెండు టీచర్, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్- మెదక్, నిజామాబాద్- ఆదిలాబాద్ జిల్లాలకు టీచర్, ఇదే జిల్లాల్లో ఒక గ్రాడ్యుయేట్ స్థానానికి, ఖమ్మం- నల్గొండ- వరంగల్ జిల్లాల్లో టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఫిబ్రవరి 27న పోలింగ్ జరగబోతున్నది.మార్చి 3న ఓట్ల లెక్కింపు జరగనున్నది. కాగా ఈ ఎన్నికలకు సంబంధించి ప్రచార పర్వం చివరి దశకు చేరడంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు.






