తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా లియోనెల్ మెస్సీ!

by Ajay Maddhiboyina |

ప్రపంచ ప్రఖ్యాత ఫుట్‌బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీని తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా అపాయింట్ చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆయనతో అధికారుల బృందం సంప్రదింపులు జరుపుతున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.

తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా  లియోనెల్ మెస్సీ!
X

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రపంచ ప్రఖ్యాత ఫుట్‌బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీని తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా అపాయింట్ చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆయనతో అధికారుల బృందం సంప్రదింపులు జరుపుతున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. మెస్సీ అంబాసిడర్‌గా ఉంటే విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం సులువు అవుతుందని రేవంత్ భావిస్తున్నట్టు సమాచారం. ఈనెల 8, 9 తేదీల్లో ప్యూచర్ సిటీ‌లో నిర్వహించే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ వేదికగా ఈ విషయాన్ని ప్రకటించే చాన్స్ ఉంది.

అంతర్జాతీయంగా మెస్సీకి క్రేజ్

ప్రముఖ పుట్‌బాల్ దిగ్గజం, అర్జంటీనా ఫుట్‌బాల్ టీం కెప్టెన్ లియోనెల్ మెస్సీకి ప్రపంచ వ్యాప్తంగా చాలా క్రేజ్ ఉంది. ఆయన ఫుట్‌బాల్ కోర్టులోకి దిగాడంటే కోట్లాది మంది ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోతారు. ఆయన ద్వారా తమ ఉత్పత్తులకు ప్రచారం కల్పించేందుకు కార్పొరేట్ సంస్థలు క్యూ కడుతాయి. అందుకోసం రూ.వేల కోట్ల ఫీజు చెల్లించేందుకు సైతం వెనుకాడవు. అలాంటి దిగ్గజాన్ని తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తే, రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు రావడం సులువు అవుతుందని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు తెలిసింది. ఈ మేరకు మెస్సీ సహకరిస్తారని ముఖ్యమంత్రి ఆశిస్తున్నట్టు అధికార వర్గాల్లో టాక్. ఇప్పటికే ఆయనతో ప్రాథమికంగా సంప్రదింపులు పూర్తియినట్టు తెలిసింది. ఈ ప్రక్రియ మొత్తం ఆయన భారత్ పర్యటనకు ముందే పూర్తి అవుతుందని ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి వెల్లడించారు.

మెస్సీతో కలిసి రేవంత్ ఫుట్‌బాల్

ఈనెల 13న ఉప్పల్ స్టేడియంలో ఫుట్‌బాల్ ప్రెండ్లీ మ్యాచ్ జరుగనుంది. ఆ రోజు మెస్సీ ఒక టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా.. సీఎం రేవంత్ మరో టీమ్‌కు సారథ్యం వహించనున్నట్టు తెలిసింది. మెస్సీ టీమ్‌లో ఇండియాలోని క్రికెటర్లు, సినిమా రంగానికి చెందిన ప్రముఖులు ఉండనున్నారు. రేవంత్ టీమ్‌లో గురుకులాల్లో చదవుతున్న విద్యార్థులు ఆడనున్నారు. అందుకోసం రెండు రోజుల నుంచి రేవంత్ ఎంసీఆర్‌హెచ్ఆర్డీ‌లో ఫుట్‌‌బాల్ ప్రాక్టీస్ చేస్తున్నారు.

అహ్మదాబాద్‌కు ఝలకిచ్చిన రేవంత్

మెస్సీ భారత్ పర్యటనలో (గోట్ టూర్ టు ఇండియా 2025) ముందుగా హైదరాబాద్‌లో పర్యటించాలని షెడ్యూల్ లేదు. కేవలం కోల్‌కతా, ఢిల్లీ, అహ్మదాబాద్, ముంబై నగరాల్లో పర్యటించడం, ప్రముఖులను కలవడం, అక్కడ ప్రెండ్లీ మ్యాచ్‌లు ఆడటం మాత్రం షెడ్యూల్‌లో ఖరారైంది. కానీ, సీఎం రేవంత్‌రెడ్డి తనకు ఉన్న పరిచయాలతో అహ్మదాబాద్ పర్యటనను హైదరాబాద్‌కు మార్చడంలో సక్సెస్ అయినట్టు అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది.

Next Story