సమ్మక్క సాగర్‌ ప్రాజెక్ట్‌కు లైన్ క్లియర్.. ఛత్తీస్‌గఢ్ సీఎంతో మంత్రి ఉత్తమ్ చర్చలు సఫలం

by Gantepaka Srikanth |

ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్‌ సాయి(CM Vishnu Deo Sai)తో తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) భేటీ అయ్యారు.

సమ్మక్క సాగర్‌ ప్రాజెక్ట్‌కు లైన్ క్లియర్.. ఛత్తీస్‌గఢ్ సీఎంతో మంత్రి ఉత్తమ్ చర్చలు సఫలం
X

దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్‌ సాయి(CM Vishnu Deo Sai)తో తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) భేటీ అయ్యారు. సోమవారం రాయ్‌పూర్‌లో‌ ఇరువురూ సమావేశమయ్యారు. గోదావరిపై తెలంగాణ చేపట్టిన సమ్మక్క సాగర్‌ ప్రాజెక్టు(Sammakka Sagar Project)కు నిరభ్యంతర పత్రం జారీ చేసే విషయమై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ విజ్ఞప్తికి ఛత్తీస్‌గఢ్ సీఎం సానుకూలంగా స్పందించారు. ఎన్‌వోసీ ఇచ్చేందుకు అంగీకరించారు. దీంతో సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు లైన్ క్లియర్ అయింది. 6.7 టీఎంసీల సామర్థ్యంతో ములుగు జిల్లాలో ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన విషయం తెలిపిందే. అయితే.. ఈ ప్రాజెక్టు వెనుక జలాల వల్ల ఛత్తీస్‌గఢ్‌లో కొంత భూభాగం ముంపునకు గురవుతోంది. నష్టపరిహారం భరించేందుకు తెలంగాణ అంగీకరించింది.

Next Story