- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Breaking News : గ్రూప్ 1 నియామకాలకు లైన్ క్లియర్.. కేసు కొట్టివేసిన సుప్రీంకోర్ట్
తెలంగాణలో గ్రూప్ 1 నియామకాల(Telangana Group 1)కు లైన్ క్లియర్ అయింది.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో గ్రూప్ 1 నియామకాల(Telangana Group 1)కు లైన్ క్లియర్ అయింది. జీవో నెం.29(GO.29)ను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్లను శుక్రవారం సుప్రీంకోర్ట్(Supreme Court) కొట్టివేసింది. దీంతో ఈ నియామకాలపై గల న్యాయపరమైన చిక్కులన్నీ తొలగిపోయాయి. మొత్తం 563 గ్రూప్ 1 పోస్టులపై 2024 ఫిబ్రవరిలో టీజీపీఎస్సీ(TGPSC) నోటిఫికేషన్ ఇవ్వగా.. జూన్, 2024లో ప్రిలిమినరీ పరీక్ష.. అక్టోబర్లో మెయిన్స్ పరీక్షలు(Group 1 Mains) జరిగాయి. ఈ పరీక్షలకు సంబంధించిన ఫలితాలు 2024, మార్చి 10న ప్రకటించగా.. మార్చి 30న జనరల్ ర్యాంక్స్ ప్రకటించారు. అయితే ఈ నోటిఫికేషన్లో జీవో నెం.29 ద్వారా తమకు అన్యాయం జరుగుతోందని కొంతమంది అభ్యర్థులు కోర్టుకు ఎక్కగా.. సుప్రీంకోర్ట్ నేడు వారి పిటిషన్ ను తోసిపుచ్చింది. దీంతో ఈ నియామకాల భర్తీకి ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోయి.. సర్టిఫికెట్ వెరిఫికేషన్ కి సిద్ధమవనుంది కమిషన్.






