- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పార్లమెంట్ మాదిరిగా అసెంబ్లీలో సెంట్రల్ హాల్: గుత్తా కీలక ఆదేశాలు..
తెలంగాణ శాసనమండలి భవనం పునర్నిర్మాణ పనులు పూర్తి చేసుకొని ఇటీవల సీఎం చేతుల మీదుగా ప్రారంభోత్సవం అయిన విషయం తెలిసిందే.

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ శాసనమండలి భవనం పునర్నిర్మాణ పనులు పూర్తి చేసుకొని ఇటీవల సీఎం చేతుల మీదుగా ప్రారంభోత్సవం అయిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశాలు కూడా నూతన శాసనమండలి భవనంలోనే నిర్వహించారు. కాగా, మండలిలో మిగిలిన ఉన్న పనుల పూర్తి పై మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి దృష్టి సారించారు. ఆయన తన ఛాంబర్ లో గురువారం ఆర్ అండ్ బీ శాఖ, ఆఘాఖాన్ సంస్థ, తెలంగాణ లెజిస్లేచర్ అధికారులతో సమావేశం నిర్వహించారు.
పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని గుత్తా సుఖేందర్ రెడ్డి ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు శాసన మండలి, శాసన సభ మధ్యలో పార్లమెంట్ తరహాలో సెంట్రల్ హాల్ పనులను త్వరగా ప్రారంభించాలని ఆయన ఆదేశించారు. శాసన మండలి సభ్యులకు, శాసన సభ సభ్యులకు సౌకర్యవంతంగా ఉండేలా సెంట్రల్ హాల్ డిజైన్ చేసి, పనులను చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో తెలంగాణ శాసన మండలి సెక్రెటరీ నరసింహాచార్యులు, ఓఎస్డీ గోవర్ధన్ రెడ్డి, పీఎస్ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






