HYD: గచ్చిబౌలిలో పిడుగు.. భయబ్రాంతులకు గురైన ప్రజలు

by Gantepaka Srikanth |

గ్రేటర్‌ హైదరాబాద్‌లో మరోసారి వర్షం(Rain) దంచికొట్టింది.

HYD: గచ్చిబౌలిలో పిడుగు.. భయబ్రాంతులకు గురైన ప్రజలు
X

దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్‌ హైదరాబాద్‌లో మరోసారి వర్షం(Rain) దంచికొట్టింది. సోమవారం సాయంత్రం కుండపోతగా కురిసింది. నల్లటి మబ్బులతో ఈదురు గాలులతో గంటల పాటు కురిసిన వర్షానికి జనజీవనం అస్థవ్యస్తమైంది. రోడ్లు చెరువులను తలపించాయి. ఫలితంగా ఎక్కడి ట్రాఫిక్ అక్కడే నిలిచిపోయింది. బంజారాహిల్స్ రోడ్డ నెంబర్-1లో ఓ చెట్టు కూలి రోడ్డుకు అడ్డంగా పడడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. మరోవైపు ఎక్కడిక్కడ వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇదిలా ఉంటే.. గచ్చిబౌలి(Gachibowli) పరిధి ఖాజాగూడలోని లంకోహిల్స్ సర్కిల్ HP పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న తాటి చెట్టు పైన పడిన పిడుగు పడింది. పిడుగుపాటుతో చెట్లు మొత్తం కాలిపోయింది. గమనించిన స్థానికులు ప్రాణభయంతో పరుగులు తీశారు.

Next Story