- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Telangana weather update: అత్తాపూర్‌లో అపార్ట్మెంట్‌పై పిడుగు పాటు
ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కారణంగా సోమవారం రాత్రి అత్తాపూర్‌లోని వాసుదేవ నగర్ హన్సరాజ్ ఎంక్లేవ్ అపార్ట్మెంట్‌పై భారీ శబ్ధంతో పిడుగు పడింది.

X
దిశ, సిటీ బ్యూరో: ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కారణంగా సోమవారం రాత్రి అత్తాపూర్‌లోని వాసుదేవ నగర్ హన్సరాజ్ ఎంక్లేవ్ అపార్ట్మెంట్‌పై భారీ శబ్ధంతో పిడుగు పడింది. 40 కుటుంబాలు నివసించే ఈ అపార్ట్మెంట్‌పై పిడుగు పడడంతో ఒక్కసారిగా లైట్లు, ట్యూబ్లైట్లు, ఫ్యాన్లు, ఫ్రిడ్జ్లు కాలిపోయాయి. దీంతో అపార్ట్మెంట్ వాసులు భయంతో పరుగులు తీశారు. అదృష్టవశాత్తు ప్రాణ నష్టం తప్పింది. పలు ఫ్లాట్లలోని కరెంటు వైరింగ్ కూడా కాలిపోయినట్టు స్థానికులు తెలిపారు. అపార్ట్మెంట్‌కు రాత్రంతా విద్యుత్ సరఫరా లేకపోవడంతో అపార్ట్మెంట్ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Read More : వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ : అవసరమైతే తప్ప బయటకు రావొద్దు, చెట్ల కింద ఉండొద్దుంటూ సూచన
Next Story






