Telangana weather update:: అవసరమైతే తప్ప బయటకు రావొద్దు, చెట్ల కింద ఉండొద్దుంటూ సూచన

by Dishanational2 |
Telangana weather update:: అవసరమైతే తప్ప బయటకు రావొద్దు, చెట్ల కింద ఉండొద్దుంటూ సూచన
X

దిశ, వెబ్‌డెస్క్ : రాష్ట్రంలో భారీవర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఇక ఈరోజు నుంచి రాష్ట్రానికి భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణశాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో నేడు హైదరాబాద్‌కు ఎల్లో అలర్ట్. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాకు రెడ్ అలెర్ట్ జారీ చేశారు. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు.

అయితే ఈరోజు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని..ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఈ మేరకు జిల్లాల యంత్రాంగాలను అలెర్ట్ చేసిన వాతావరణ శాఖ.. అవసరమైతే తప్ప బయటకు రావద్దని , పంటపొలాల్లో పని చేసే వారు చెట్ల కింద.. ఎత్తైన ప్రదేశాల్లో ఉండొద్దని కోరింది.

ఇవి కూడా చదవండి :: HYD: అత్తాపూర్‌లో అపార్ట్మెంట్‌పై పిడుగు పాటు

Next Story

Most Viewed