TG News : గవర్నర్ చేత అబద్దాలు చెప్పించారు : ఏలేటి మహేశ్వర్ రెడ్డి

by Muthe.Rajitha |

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు(Telangana Assembly Budget Sessions) నేడు ప్రారంభం అయ్యాయి.

TG News : గవర్నర్ చేత అబద్దాలు చెప్పించారు : ఏలేటి మహేశ్వర్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు(Telangana Assembly Budget Sessions) నేడు ప్రారంభం అయ్యాయి. ముందుగా ఉభయసభలను ఉద్దేశించి అసెంబ్లీలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(Governor Jishnu Dev Varma) ప్రసంగించారు. తెలంగాణ అభివృద్ధి, రాష్ట్రంలో పాలన, రైతు భరోసా, రాష్ట్ర గీతం వంటి అంశాలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే గవర్నర్ చేత అబద్దాలు చెప్పించారని మండిపడ్డారు బీజేపీఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి(Alleti Maheshwar Reddy). రైతులకు పూర్తిగా రుణమాఫీ జరగకముందే, అందరికీ రుణమాఫీ జరిగిందని, పంట పెట్టుబడి సహాయం రైతుబంధు అందరికీ అందిందని అబద్దాలు చెప్పించారని మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీ కూడా పూర్తిగా నెరవేర్చలేదని.. కానీ సభలో గవర్నర్ చేత ఆరు హామీలు అమలయ్యాయని మాట్లాడించారని అన్నారు.

ఇలాంటి అసత్యాలు గవర్నర్ చేత చెప్పించి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టాలని చూస్తోందని ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాలు కేవలం పదిరోజులు జరిపితే ప్రజా సమస్యలపై ఎలా మాట్లాడగలమని ప్రశ్నించారు. ఏప్రిల్ 20 వరకు అసెంబ్లీ సమావేశాలు నడపాలని డిమాండ్ చేస్తున్నట్టు పేర్కొన్నారు. బడ్జెట్ మీద చర్చించేందుకు కేవలం 5 రోజులే సమయం ఇస్తే ఎలా అని కనీసం పదిహేను రోజులైనా బడ్జెట్ పై చర్చ జరగాలని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆయనకు కావాల్సిన బిల్లుల ఆమోదానికి, బడ్జెట్ ఆమోదానికే అసెంబ్లీ పెట్టినట్టుందని ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపణలు చేశారు.

Next Story