నూతన మద్యం షాపులకు లైసెన్స్‌లు జారీ

by Malleboina Mahesh |

డిసెంబరు 1 నుంచి ప్రారంభమయ్యే నూతన మద్యం షాపులకు లైసెన్స్ జారీ చేయాలని రంగారెడ్డి జిల్లా ఎక్సయిజ్ డిప్యూటి కమిషనర్‌ పి.దశరథ్‌ తెలిపారు.

నూతన మద్యం షాపులకు లైసెన్స్‌లు జారీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: డిసెంబరు 1 నుంచి ప్రారంభమయ్యే నూతన మద్యం షాపులకు లైసెన్స్ జారీ చేయాలని రంగారెడ్డి జిల్లా ఎక్సయిజ్ డిప్యూటి కమిషనర్‌ పి.దశరథ్‌ తెలిపారు. ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ కార్యాలయంలో నూతన మద్యం షాపుల ఏర్పాట్లపై బుధవారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రభుత్వం కొత్తగా విడుదల చేసిన 145 జీవో ప్రకారం మద్యం షాపులను అవుటర్‌ రింగ్‌ లోపల మార్చుకోవడానికి దరఖాస్తులు వస్తే స్వీకరించాలని తెలిపారు. రంగారెడ్డి ఎక్సైజ్‌ డివిజన్‌ కింద 514 మద్యం షాపులు ఉన్నాయని వాటికి లైసెన్స్‌ జారి చేయడంతో పాటు లైసెన్స్ ఫీజు వివరాలు తెలిపి వాటిని చెల్లించే విధంగా చర్యలు చెపట్టాలని సూచించారు.

ప్రస్తుతం నడుస్తున్న మద్యం షాపులకు సంబంధించిన బకాయిలను వసూలు చేయాలని, టార్గెట్ మేరకు మద్యాన్ని లిప్టు చేసే విధంగా చూడాలని తెలిపారు. ప్యూరియస్‌ లిక్కర్‌, నాన్‌ డ్యూటి పయిడ్‌ లిక్కర్‌లను అమ్మకాలు జరుపుకుండా చూడాలని అదేశించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌, డీటీఎప్‌ టీమ్‌లు క్రైమ్‌ కంట్రోల్‌పై దృష్టి పెట్టాలని అదేశించారు. శంషాబాద్‌, మేడ్చల్‌, మల్కాజ్‌గిరి, సరూర్‌నగర్‌, వికారాబాద్‌ ఎక్సైజ్‌ సూపరింటెండ్‌లు కృష్ణ ప్రియ, ఫయాజోద్దీన్‌, కె.నవీన్‌ , విజయ భాస్కర్‌ గౌడ్‌లతోపాటు ఏఈఎస్‌లు, సీఐలతో సమావేశం నిర్వహించారు.

Next Story