Jubilee Hills by Poll: లైసెన్సు కలిగిన తుపాకులు సరెండర్‌ చేయాలి: సజ్జనార్ ఆదేశాలు

by Prasad Jukanti |

జూబ్లీహిల్స్ బై పోల్ నిర్వహణకు హైదరాబాద్ పోలీస్ సిద్ధంగా ఉందని హైదరాబాద్ సిటీ సీపీ సీపీ సజ్జనార్ తెలిపారు.

Jubilee Hills by Poll:  లైసెన్సు కలిగిన తుపాకులు సరెండర్‌ చేయాలి: సజ్జనార్ ఆదేశాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: జూబ్లీహిల్స్ బై పోల్ నిర్వహణకు హైదరాబాద్ పోలీసు సిబ్బంది సిద్ధంగా ఉందని హైదరాబాద్ సిటీ సీపీ సీపీ సజ్జనార్ తెలిపారు. ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అన్ని నిబంధనలు పాటిస్తున్నామన్నారు. ఎన్నికల్లో ప్రజలు శాంతియుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు, శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా ముందస్తుగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ బై పోల్ కు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ షెడ్యూల్ రిలీజ్ చేసిన నేపథ్యంలో ఇవాళ హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ తో పాటు సీపీ సజ్జనార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సజ్జనార్.. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందునా జిల్లాలో లైసెన్స్ డు తుపాకులు పొందిన నాయకులు, వ్యాపారులు, ప్రముఖులు వెంటనే ఆయా పోలీస్‌ స్టేషన్లలో డిపాజిట్‌ చేయాలని ఆదేశించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినా, ఎక్కడైనా అనుమానాస్పద కదలికలు గమనిస్తే ప్రజలు వెంటనే డయల్ 100 లేదా 112 కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు. రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్ల బైండోవర్ ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు.

Next Story