- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Bandi Sanjay Kumar : నాన్నకు లేఖ.. కాంగ్రెస్ వదిలిన బాణం
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(BRS MLC Kavitha) ఆ పార్టీ అధినేత కేసీఆర్(KCR) కు నాన్నకు ప్రేమతో అంటూ రాసిన లేఖ(Ltter) రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతోంది.

దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(BRS MLC Kavitha) ఆ పార్టీ అధినేత కేసీఆర్(KCR) కు నాన్నకు ప్రేమతో అంటూ రాసిన లేఖ(Ltter) రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతోంది. ఆ పార్టీ పాజిటివ్స్, నెగెటివ్స్ అంటూ పేర్కొంటూ లేఖ రాసినట్టు తెలుస్తుండగా.. ఈ ఘటనపై కాంగ్రెస్, బీజేపీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. తాజాగా కవిత లేఖపై కేంద్రమంత్రి బండి సంజయ్(Bandi Sanjay) ఘాటు వ్యాఖ్యలు చేశారు. నాన్నకు లేఖ వ్యవహరంలో కవితను కాంగ్రెస్ వదలిన బాణంగా అభివర్ణించారు. ఇది కేవలం రాజకీయ డ్రామా మాత్రమేనని, తెలంగాణ ప్రజలు దీనిని పట్టించుకోవడం లేదని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్(Congress), బీఆర్ఎస్(BRS) రెండూ విఫలమయ్యాయని.. ఈ పార్టీలు కుటుంబ పాలనకు ప్రాధాన్యత ఇస్తూ ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రెండు పార్టీల నాయకులు తమ వ్యక్తిగత, కుటుంబ సంక్షోభాలను ప్రజలపై రుద్దుతున్నారని మండిపడ్డారు.
BRS పాలనలో జరిగిన అవినీతి, మద్యం మాఫియా, భూకబ్జాలు, ఉద్యోగ నియామకాల్లో అక్రమాలను ప్రజలు ఎప్పటికీ క్షమించబోరని అన్నారు. అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల హామీలను నెరవేర్చడంలో విఫలమైందని, ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు. బీజేపీ మాత్రమే కుటుంబ పాలనకు వ్యతిరేకంగా నిలబడి, నిజమైన మార్పును తీసుకువచ్చే పార్టీ అని బండి సంజయ్ పేర్కొన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే, రాష్ట్రంలో అభివృద్ధి, పారదర్శక పాలన, అవినీతి రహిత పరిపాలన అందిస్తుందని హామీ ఇచ్చారు.
Also Read: కవిత లెటర్ మీద మాకే క్లారిటీ లేదు.. మాజీ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు






