- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బదిలీల నిషేధం నుంచి మినహాయింపు ఇవ్వండి: జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌కి ట్రెసా వినతి
ఉద్యోగులకు ఇచ్చిన హామీల అమలులో భాగంగా రాష్ట్ర స్థాయి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని పునరుద్ధరించడం చారిత్రాత్మక నిర్ణయమని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వంగా రవీందర్ రెడ్డి, కే గౌతమ్ కుమార్‌లు అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ఉద్యోగులకు ఇచ్చిన హామీల అమలులో భాగంగా రాష్ట్ర స్థాయి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని పునరుద్ధరించడం చారిత్రాత్మక నిర్ణయమని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వంగా రవీందర్ రెడ్డి, కే గౌతమ్ కుమార్‌లు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పథకాల అమలులో కీలక పాత్ర పోషిస్తున్న రెవెన్యూ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తక్షణ చర్యలు తీసుకుంటుందనని ఆశిస్తున్నామన్నారు. ఉద్యోగుల ఆత్మస్థైర్యాన్ని పెంపొందించేలా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటే మరింత ఉత్సాహంతో ప్రజాసేవలో పని చేస్తారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారం కోసం సచివాలయంలో శుక్రవారం జరిగిన తెలంగాణ సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ట్రెసా తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వినతిపత్రం సమర్పించారు.
రెవెన్యూ శాఖ ఉద్యోగులకు బదిలీల నిషేదం నుంచి మినహాయింపు కల్పించాలని, పలువురు కలెక్టర్లు కూడా ప్రభుత్వానికి ఇదే అంశంపై విన్నవించిన విషయాన్ని గుర్తు చేశారు. 317 జీవో కారణంగా ఇబ్బందులు పడుతున్న ఉద్యోగుల పరస్పర బదిలీల దరఖాస్తులపై నిర్ణయం తీసుకోవడంతో పాటు మరోసారి పరస్పర బదిలీలకు అవకాశం కల్పించాలని కోరారు. అనేక సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న వీఆర్‌ఏల కారుణ్య నియామకాలను వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. రెగ్యులరైజేషన్ సమయంలో ఇతర జిల్లాలకు బదిలీయైన వీఆర్‌ఏలను వారి కుటుంబాలకు సమీప ప్రాంతాలకు మార్చి న్యాయం చేయాలని కోరారు. గత పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా రెవెన్యూ సిబ్బందికి చెల్లించాల్సిన పారితోషిక బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. అనేక సంవత్సరాలుగా పని చేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఆపరేటర్ల విషయంలో ప్రభుత్వం మరోసారి సానుకూలంగా ఆలోచించాలని కోరారు. ఈ సమావేశం ద్వారా ఉద్యోగ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు వస్తోందన్న విశ్వాసం ఉద్యోగుల్లో కలుగుతోందని ట్రెసా నాయకులు అభిప్రాయపడ్డారు.






