మహిళా సాధికారతకు కలిసి పనిచేద్దాం: మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నెరెళ్ల శారద

by Kema Shiva Kumar |

మహిళా సాధికారతకు దోహదపడే కార్యక్రమాలపై కలిసి పని చేద్దామని తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్ పర్సన్ నెరెళ్ల శారద అన్నారు.

మహిళా సాధికారతకు కలిసి పనిచేద్దాం: మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నెరెళ్ల శారద
X

దిశ, తెలంగాణ బ్యూరో: మహిళా సాధికారతకు దోహదపడే కార్యక్రమాలపై కలిసి పని చేద్దామని తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్ పర్సన్ నెరెళ్ల శారద అన్నారు. ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఇస్కీ) డైరెక్టర్ రామేశ్వర్ రావు తన బృందంతో కలిసి తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్ నెరెళ్ల శారదను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా, ఇస్కీ, తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ మధ్య పరస్పర సహకారం, అవగాహన కార్యక్రమాలు, భాగస్వామ్య అవకాశాలపై విస్తృతంగా చర్చించారు. మహిళా సాధికారత, నైపుణ్యాభివృద్ధి, స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించడానికి సంయుక్త కార్యక్రమాలు చేపట్టవచ్చని సూచించారు.

ఇస్కీలో మహిళల అభివృద్ధి - కేంద్రిత శిక్షణా కార్యక్రమాలను నిర్వహించేందుకు చైర్‌పర్సన్‌‌ను ఆహ్వానించారు. ప్రత్యేకంగా మహిళలకు అనుకూలంగా ఉండే శిక్షణ మాడ్యూల్స్ రూపకల్పన చేస్తే వారు సాంకేతిక పరిజ్ఞానం, వృత్తి నైపుణ్యం, ఆర్థిక స్వావలంబన సాధించడానికి అవకాశం లభిస్తుందని రామేశ్వర్ రావు అన్నారు. ఇస్కీ ప్రతిపాదనలను చైర్ పర్సన్ శారద అభినందించడంతో పాటు భవిష్యత్తులో మహిళా సాధికారతకు దోహదపడే సంయుక్త కార్యక్రమాలను ప్రణాళిక చేయడానికి కమిషన్ పూర్తిగా సహకరిస్తుందని తెలిపారు. ఈ సమావేశం పరస్పర సహకారం, సామాజిక బాధ్యత, మహిళా సాధికారత దిశగా సార్థకమైన అడుగుగా నిలుస్తుందని ఆమె నెరెళ్ల శారద అన్నారు.

Next Story