అసెంబ్లీ సాక్షిగా చర్చిద్దాం : కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్

by Muthe.Rajitha |

నీళ్లపై నిగ్గు తేలాలంటే మామా, అల్లుడు అసెంబ్లీలో మాట్లాడాలని, దమ్ముంటే కేసీఆర్ ను సభకు తీసుకొచ్చి మాట్లాడిస్తే...వాస్తవాలు తెలుస్తాయని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ స్పష్టం చేశారు.

అసెంబ్లీ సాక్షిగా చర్చిద్దాం : కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్
X

దిశ, తెలంగాణ బ్యూరో : నీళ్లపై నిగ్గు తేలాలంటే మామా, అల్లుడు అసెంబ్లీలో మాట్లాడాలని, దమ్ముంటే కేసీఆర్ ను సభకు తీసుకొచ్చి మాట్లాడిస్తే...వాస్తవాలు తెలుస్తాయని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ స్పష్టం చేశారు. అసెంబ్లీ సాక్షిగా మీ పదేళ్ల పాలన, మా రెండేళ్ల పానలనపై చర్చిద్దాం..దమ్ముంటే హరీశ్ రావు సవాల్ స్వీకరించి. కేసీఆర్ ను తీసుకుని రావాలి..కేసీఆర్ పదేళ్ల పాలనలో నీళ్ల వాటలో ఎన్ని వాడుకున్నారో చెప్పాలని ఆయన సవాల్ విసిరారు. సోమవారం బల్మూర్ వెంకట్ సీఎల్సీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ

చట్టసభలోనే మీరు చేసిన తప్పుల లెక్కేంటో తేలూస్తాం రండి..తెలంగాణ ప్రయోజనాల పట్ల ఎవరి చిత్తశుద్ది ఏంటో నిరూపించుకుందామన్నారు. పక్క రాష్ట్రం కోసం పదేళ్లు రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టింది ఎవరు..ఏపీకి వెళ్లి చేపల పులుసుకు చేతులు కడుకున్నది ఎవరు..ప్రజాభవన్ సాక్షిగా జగన్ తో కేసీఆర్, కేటీఆర్ చేసిన మంత్రాగం ఏంటీ..రెండేళ్లలో కంప్లీట్ చేస్తానన్న పాలమూరు ప్రాజెక్టు పదేళ్లైనా చేయలేదని ఆయన ప్రశ్నించారు. రూ.35 వేల కోట్లతో పూర్తయ్యే కాళేశ్వరంను లక్షకోట్లకు పెంచి దోచుకున్నారని, కాళేశ్వరం ప్రాజెక్టును ఎవరి ప్రయోజనాల కోసం మూడేళ్లలో పూర్తి చేశారని ఎమ్మెల్సీ వెంకట్ ప్రశ్నించారు.

హరీశ్ రావు మాట్లాడే ముందు ఆలోచించాలని, చంద్రబాబుకు నీళ్లు ఎలా దోచుకోవాలో చెప్పింది కేసీఆరే కదా? అని ఆయన ఆరోపించారు. పాలమూరు ప్రజలు మీరు చేసిన ఢోకాకు సరైన బుద్ది చెప్పారని, ఆ జిల్లా ప్రజల ప్రాపకం కోసమే కేసీఆర్ కొత్త డ్రామా ఆడుతున్నారన్నారు. కేసీఆర్ సొంత ప్రాంతమైన గజ్వేల్ లో సగం మంది సర్పంచ్ లను గెలిపించుకోలేకపోయారని బల్మూర్ వెంకట్ విమర్శించారు. పార్టీ నడపడంలో కేటీఆర్, హరీశ్ రావు ఫెయిల్ అయ్యారని, ఇద్దరు దద్దమ్మలనే అందుకే కేసీఆర్ బయటకు వస్తున్నారన్నారు. కేటీఆర్, హరీశ్ రావు బాగోతాలను కవిత బయటపెడుతోందని, వాటికి సమాధానం చెప్పే దమ్ము, ధైర్యం కేటీఆర్, హరీశ్ రావుకు లేదని, మౌనంగా ఉంటున్నారంటే మీరు తప్పు చేసింది నిజమనే కదా అని బల్మూర్ వెంకట్ ప్రశ్నించారు.

Next Story