- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Leopard in village: నాగర్‌కర్నూల్‌లో ఇళ్ల మధ్య చిరుతపులి సంచారం
నాగర్ కర్నూల్ (Nagar kurnool) జిల్లాలో చిరుతపులి (leoperd) సంచారం కలకలం రేపింది.

దిశ,వెబ్ డెస్క్: నాగర్ కర్నూల్ (Nagar kurnool) జిల్లాలో చిరుతపులి (leoperd) సంచారం కలకలం రేపింది. జిల్లాలోని దోమలపెంట గ్రామంలో అర్ధరాత్రి ఏకంగా ఇళ్ల మధ్యనే చిరుతపులి సంచరించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిరుత పులి గ్రామంలో నడుచుకుంటూ వెళుతుంటే పక్కనే ఉన్న ఇంట్లో మనుషులు కనిపిస్తున్న దృష్యాలు కనిపిస్తున్నాయి.
వారంలో మూడుసార్లు గ్రామంలో చిరుత పులి సంచరించిందని గ్రామస్థులు చెబుతున్నారు. చిరుత సంచారంతో బయటకు రావాలంటేనే భయపడిపోతున్నామని చెబుతున్నారు. తక్షణమే ఫారెస్ట్ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల కాలంలో క్రూరమృగాలు జనావాసాల్లోకి రావడం పెరిగిపోయింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పులులు ఏకంగా గ్రామాల్లోనే సంచరిస్తూ మనుషులపై దాడి చేసిన ఘటనలు నమోదవుతున్నాయి.






