పంచాయతీరాజ్ చట్టం సవరణ బిల్లుకు శాసనమండలి ఏకగ్రీవ ఆమోదం

by Ramesh Naini |

పంచాయతీరాజ్ చట్టంలోని 21వ సెక్షన్‌కు సవరణ చేస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును శాసనమండలి ఏకగ్రీవంగా ఆమోదించింది.

పంచాయతీరాజ్ చట్టం సవరణ బిల్లుకు శాసనమండలి ఏకగ్రీవ ఆమోదం
X

దిశ, డైనమిక్ బ్యూరో: పంచాయతీరాజ్ చట్టంలోని 21వ సెక్షన్‌కు సవరణ చేస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును శాసనమండలి ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇద్దరు పిల్లలకు మించి సంతానం ఉంటే గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులుగా ప్రకటించే నిబంధనను తొలగిస్తూ ఈ సవరణను తీసుకొచ్చారు.

నిన్న అసెంబ్లీలో బిల్లు ఆమోదం

ఈ సవరణకు సంబంధించి గతంలో ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసిన విషయం తెలిసిందే. నిన్న అసెంబ్లీ ఈ బిల్లును ఆమోదించగా, నేడు (సోమవారం) శాసనమండలిలో మంత్రి సీతక్క బిల్లును ప్రవేశపెట్టారు. బిల్లుపై జరిగిన చర్చలో ఎమ్మెల్సీలు మహేశ్ కుమార్ గౌడ్, నెల్లికంటి సత్యం పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు. చర్చ అనంతరం సభ్యులందరి సమ్మతితో శాసనమండలి ఈ సవరణ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సవరణతో గ్రామీణ స్థానిక ఎన్నికల్లో పోటీకి సంబంధించి ఉన్న అర్హత నిబంధనల్లో కీలక మార్పు చోటు చేసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

Next Story