కాంగ్రెస్ భూ దందా కోసమే హిల్ట్ పాలసీ

by velandi.Saikiran |

కాంగ్రెస్ ప్రభుత్వం భూ దందా కోసమే హిల్ట్ పాలసీ తెచ్చిందని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ ఆరోపించారు.

కాంగ్రెస్ భూ దందా కోసమే హిల్ట్ పాలసీ
X

కాంగ్రెస్ భూ దందా కోసమే హిల్ట్ పాలసీ

- బీఆర్ఎస్ హయాంలో ఇలాంటి జీవోలు ఇవ్వలేదు

- 45 రోజుల్లో ప్రక్రియను పూర్తిచేసి డబ్బులు దండుకోవాలని యత్నం

- శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వం భూ దందా కోసమే హిల్ట్ పాలసీ తెచ్చిందని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ ఆరోపించారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. దాదాపు పది వేల ఎకరాల ప్రభుత్వ భూములను కారు చౌకగా కట్టబెట్టేందుకే హిల్ట్ పాలసీ తెచ్చారని అన్నారు. .కేవలం 45 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసి డబ్బులు దండుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారని ఆరోపించారు. మంత్రి శ్రీధర్‌బాబు లీజు భూములకు హిల్ట్ వర్తించదని చెబుతున్నారని.. జీవోలో మాత్రం తొమ్మిది వేల ఎకరాలపైనే ప్రస్తావించారని తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో ఇలాంటి జీవోలు ఎప్పుడూ ఇవ్వలేదని.. పారదర్శకమైన విధానం అమలు చేశామని చెప్పారు.

వ్యవసాయ రంగంతోపాటు పరిశ్రమలు నడిపేలా చూడటం ప్రభుత్వ బాధ్యత అని.. పరిశ్రమలు లేకపోతే ఉపాధి ఎలా అని ప్రశ్నించారు. ఓఆర్ఆర్ అవతల పరిశ్రమలు స్థాపించే అవకాశం పారిశ్రామిక వేత్తలకు కల్పించాలన్నారు. హిల్ట్ పాలసీ రావడానికి వెనుక వేల కోట్ల రహస్య ఒప్పందాలు ఉన్నాయని ఆరోపించారు. హిల్ట్‌కు వ్యతిరేకంగా తమ పోరాటాన్ని ఢిల్లీ దాకా తీసుకెళ్తామని హెచ్చరించారు. ప్రభావిత ప్రాంతాల పర్యటనకు ఎనిమిది నిజనిర్ధారణ బృందాలను పార్టీ నియమించిందన్నారు. కేటీఆర్, హరీశ్‌రావు, మాజీ మంత్రులు ఈ బృందాలకు నేతృత్వం వహించి వేర్వేరు క్లస్టర్లలో పర్యటిస్తారని వెల్లడించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి రియల్ ఎస్టేట్ బ్రోకర్ అవతారమెత్తారని అన్నారు. సమావేశంలో మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story