- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వాళ్లు చాలా ఇబ్బంది పడుతున్నారు.. బిల్లులు విడుదల చేయండి: సీఎం రేవంత్‌కు గుత్తా లేఖ
by Gantepaka Srikanth |
రాష్ట్రంలో మన ఊరు-మన బడి కార్యక్రమం కింద చేపట్టిన పనులకు సంబంధించి చెల్లించాల్సిన బిల్లులను వెంటనే క్లియర్ చేయాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో మన ఊరు-మన బడి కార్యక్రమం కింద చేపట్టిన పనులకు సంబంధించి చెల్లించాల్సిన బిల్లులను వెంటనే క్లియర్ చేయాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. ఈ మేరకు ఆయన గురువారం ముఖ్యమంత్రికి లేఖ రాశారు. ఈ సందర్భంగా లేఖలో పెండింగ్‌లో ఉన్న బిల్లుల మొత్తం దాదాపు రూ. 361.350 కోట్లుగా ఉందని గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. ఈ బిల్లులు చాలా కాలంగా చెల్లించకుండా ఉన్నాయని, దీనివల్ల కాంట్రాక్టర్లు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఆయన విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్‌కు రాసిన లేఖను కూడా ముఖ్యమంత్రికి పంపించారు. ఈ పెండింగ్ బిల్లులను త్వరగా చెల్లించి, కాంట్రాక్టర్లకు ఉపశమనం కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Next Story






