- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శాసనమండలి జనవరి 2కు వాయిదా
తెలంగాణ శాసన మండలి వాయిదా పడింది.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ శాసన మండలి వాయిదా (Council Adjourned) పడింది. సోమవారం ఉదయం సభ ప్రారంభమయ్యాక ఇటీవల మరణించిన దివంగత సభ్యులు మాధవరం జగపతిరావు, అహ్మద్ పీర్ షబ్బీర్‍లకు సభ నివాళులు అర్పించింది. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ (Gutha Sukender Reddy) సంతాప తీర్మానాలు చదివి వినిపించారు. అనంతరం సభ్యులు పలు అంశాలపై మాట్లాడారు. ఆ తర్వాత పలు ఆర్డినెన్సులు, డాక్యుమెంట్లను మంత్రులు వివేక్ వెంకట స్వామి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు సభలో ప్రవేశపెట్టారు. అనంతరం సభను జనవరి 2వ తేదీకి చైర్మన్ వాయిదా వేశారు. ఈ సందర్భంగా దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ ఇటీవల మరణించిన రాష్ట్ర గీత రచయిత అందెశ్రీకి సభా పక్షాన సంతాపం తెలిపే అవకాశాన్ని పరిశీలించాలని కోరారు. సాధారణంగా సభలో సభ్యులైన వారికే సంతాపం తెలిపే సంప్రదాయం ఉంది. కానీ అందెశ్రీ తన పాట ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని ఎంతగానో ప్రభావింతం చేశారు. ఆయన ఈ సభలో సభ్యులు కాకపోయినా విశేషమైన సందర్భంగా భావించి సభలో ఆయనకు సంతాపం తెలిపే అవకాశం పరిశీలించాలని సూచన చేశారు. ఇందుకు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ సానుకూలంగా స్పందించారు.






