CM Revanth Reddy: కాసేపట్లో సీఎంతో ‘న్యాయ సలహా’ కమిటీ భేటీ

by Prasad Jukanti |   (  Updated:2025-08-28 05:17:45  IST  )

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్ పార్టీ వేగం పెంచింది.

CM Revanth Reddy: కాసేపట్లో సీఎంతో ‘న్యాయ సలహా’ కమిటీ భేటీ
X

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో (CM Revanth Reddy) కాసేపట్లో బీసీ రిజర్వేషన్ల (BC Reservations) అంశంలో నియమించిన న్యాయ సలహా సంప్రదింపుల కమిటీ (Legal Advisory Committee) భేటీ కాబోతున్నది. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో జరిగిన సమావేశానికి టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, న్యాయ సలహా సంప్రదింపుల కమిటీ సభ్యులు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క హాజరు కానున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు విషయంలో కమిటీ నివేదికపై చర్చించనున్నట్లు సమాచారం. కాగా నిన్న గాంధీ‌భవన్‌లో కమిటీ భేటీ అయింది. బీసీ రిజర్వేషన్ల అమలు విషయంలో మూడు ఆప్షన్స్ సిద్ధం చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఇవాళ కమిటీ సభ్యులు సీఎం సమావేశం కాబోతుండటం ఆసక్తిగా మారింది.

Next Story