- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TRS: తెలంగాణ రక్షణ సేనలో వివిధ పార్టీల నేతల చేరికలు
by Ramesh Naini |
తెలంగాణ రక్షణ సేన (TRS)లో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఆదివారం పెద్ద ఎత్తున చేరారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్)లో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఆదివారం పెద్ద ఎత్తున చేరారు. బోథ్, ఖైరతాబాద్, అంబర్‌పేట్, నర్సాపూర్ నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన నాయకులు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ఆధ్వర్యంలో 200 మందికి పైగా నాయకులు, కార్యకర్తలు పార్టీలో చేరారు. సీనియర్ నాయకుడు మతిన్ అధ్వర్యంలో అంబర్‌పేట్ నియోజకవర్గానికి చెందిన ముస్లిం మహిళలు టీఆర్ఎస్‌లో చేరారు. ఖైరతాబాద్ నియోజకవర్గానికి నర్సింహ తన అనుచరులతో కలిసి చేరారు. నర్సాపూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు యువకులు టీఆర్ఎస్‌లో చేరారు.
Next Story






