Hyderabad Metro: ఎల్బీ నగర్ టు హయత్ నగర్ మెట్రో రూట్ మ్యాప్

by Ramesh Naini |

హైదరాబాద్‌లో మెట్రోరైలు రెండో దశ విస్తరణలో భాగంగా ఎల్బీనగర్‌ నుంచి హయత్‌నగర్‌ వరకు దాదాపు 7 కిలోమీటర్ల మేర నిర్మాణం చేపట్టనున్న విషయం తెలిసిందే.

Hyderabad Metro: ఎల్బీ నగర్ టు హయత్ నగర్ మెట్రో రూట్ మ్యాప్
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌లో (Hyderabad Metro) మెట్రోరైలు రెండో దశ విస్తరణలో భాగంగా ఎల్బీనగర్‌ నుంచి హయత్‌నగర్‌ వరకు దాదాపు 7 కిలోమీటర్ల మేర నిర్మాణం చేపట్టనున్న విషయం తెలిసిందే. ఈ మార్గంలో మొత్తం 6 స్టేషన్లు రాబోతున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ మెట్రో ఎక్స్ వేదికగా (LB Nagar to Hayat Nagar Metro) రూట్‌మ్యాప్‌ను పోస్ట్ చేసింది. ఎల్బీ‌నగర్ మెట్రో స్టేషన్ నుంచి చింతల్‌కుంట, వనస్థలిపురం, ఆటోనగర్, లెక్చరర్స్ కాలనీ, ఆర్టీసీ కాలనీ, హయత్‌నగర్ వరకు స్టేషన్లు రూట్ మ్యాప్‌లో పేర్కొంది. హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశలో భాగంగా ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్ వరకు ప్రతిపాదిత కారిడార్ (7.1 కిలోమీటర్లు) చేపట్టబడతున్నట్లు తెలిపింది.

మియాపూర్-పటాన్ చెరు (13.4 కిలోమీటర్లు) పొడిగింపు, కారిడార్ I మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వరకు (29 కిలోమీటర్లు) ఇప్పటికే అమలులో ఉండటంతో, హయత్ నగర్ వైపు కొత్త మార్గం కలిపి పటాన్ చెరు నుంచి హయత్ నగర్ వరకు నగరం వాయువ్య చివర నుంచి ఆగ్నేయ చివరి వరకు దాదాపు 50 కిలోమీటర్లు సజావుగా కనెక్టివిటీని తెస్తుందని పేర్కొంది.

Next Story