దుండగుల కాల్పుల్లో ఎల్బీ నగర్ విద్యార్థి మృతి.. సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి

by Kema Shiva Kumar |

అమెరికా (America)లో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ఎల్బీ నగర్‌ (LB Nagar) పరిధిలోని బీఎన్ రెడ్డి (BN Reddy) ప్రాంతానికి చెందిన విద్యార్థి పోలే చంద్రశేఖర్ (Pole Chandrashekar) మృతి చెందిన విషయం తెలిసిందే.

దుండగుల కాల్పుల్లో ఎల్బీ నగర్ విద్యార్థి మృతి.. సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి
X

దిశ, వెబ్‌‌డెస్క్: అమెరికా (America)లో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ఎల్బీ నగర్‌ (LB Nagar) పరిధిలోని బీఎన్ రెడ్డి (BN Reddy) ప్రాంతానికి చెందిన విద్యార్థి పోలే చంద్రశేఖర్ (Pole Chandrashekar) మృతి చెందిన విషయం తెలిసిందే. 2023లో బీడీఎస్‌ పూర్తి చేసి చంద్రశేఖర్ ఉన్నత చదువుల నిమిత్తం యూఎస్‌కు వెళ్లాడు. ఇవాళ తెల్లవారుజామున డాలస్‌ (Dallas)లో దుండగుడు జరిపిన కాల్పుల్లో అతడు మృతి చెందాడు. ఈ నేపథ్యంలో పోలే చంద్రశేఖర్ మృతిపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ (ట్విట్టర్) వేదికగా ట్వీట్ చేశారు. అమెరికాలో దుండగుల కాల్పుల్లో ఎల్బీ నగర్‌కు చెందిన విద్యార్థి పోలే చంద్రశేఖర్ మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతిని, ఆవేదనను కలిగించిందని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలిపారు. చంద్రశేఖర్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది. భౌతిక కాయాన్ని స్వస్థలానికి తీసుకువచ్చేందుకు అన్ని విధాలా సహకారం అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.

Next Story