రూ.940 కోట్లతో ఎల్బీనగర్ - హయత్‌నగర్ డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్

by Ramesh Naini |

ఎల్బీనగర్-హయత్ నగర్ మార్గంలో రూ.940 కోట్లతో నాగ్ పూర్ తరహాలో డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్ నిర్మించనున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.

రూ.940 కోట్లతో ఎల్బీనగర్ - హయత్‌నగర్ డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎల్బీనగర్-హయత్ నగర్ మార్గంలో రూ.940 కోట్లతో నాగ్ పూర్ తరహాలో డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్ నిర్మించనున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. సభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డి, మనోహర్ రెడ్డి, సుధీర్ రెడ్డి, మేఘా రెడ్డి, కే ఆర్.నాగరాజు, వీర్లపల్లి శంకర్ అడిగిన ప్రశ్నలకు సమాధానంగా వెంకట్ రెడ్డి మాట్లాడారు. రాబోయే రెండేండ్లలో రూ.20వేల కోట్లతో రోడ్డు ప్రాజెక్టులు చేపట్టనున్నామని చెప్పారు. మన్ననూర్-శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టుకు సైతం కేంద్ర కేబినెట్ ఆమోదించనున్నదని తెలిపారు. మదినగుడ-బీహెచ్ఈఎల్ మార్గంలో 1.2కి.మీ డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్ కూడా నిర్మించనున్నామని మంత్రి తెలిపారు. అంతకుముందు కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ అబ్దుల్లాపూర్ మెట్ దాటిన తర్వాత ఇంజినీరింగ్ కాలేజీల విద్యార్థులు రోడ్డు దాటాలంటే ప్రమాదంగా మారిందని, అక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జి ని నిర్మించాలని కోరారు. తలకొండపల్లి-కడ్తాల్ రోడ్డును డెవలప్ చేయాలని సూచించారు.

Next Story