- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
High court: హైకోర్టులో విషాదం.. కేసు వాదిస్తుండగా కుప్పకూలిన న్యాయవాది
తెలంగాణ హైకోర్టు హాల్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది.

దిశ,డైనమిక్ బ్యూరో: తెలంగాణ హైకోర్టులో విషాద ఘటన చోటుచేసుకుంది. కోర్టు హాల్లో సీనియర్ లాయర్ కుప్పకూలిన సంఘటన న్యాయవాదులను కలిచివేసింది. మంగళవారం హైకోర్టులో 21వ కోర్టు హాల్‌లో న్యాయమూర్తి ముందు ఓ కేసు విషయంలో తన వాదనలు వినిపిస్తుండగా సీనియర్ న్యాయవాది వేణుగోపాలరావు అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. వెంటనే తోటి న్యాయవాదులు ఆయనను అంబులెన్స్‌లో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. న్యాయవాది వేణుగోపాలరావు గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఇక, న్యాయవాది మృతికి సంతాపంగా హైకోర్టులో అన్ని బెంచ్‌లలో జడ్జిలు విచారణ నిలిపి వేసినట్లు తెలిసింది. అన్ని కోర్టులో విచారణలు న్యాయమూర్తులు రేపటికి వాయిదా వేసినట్లు తెలిసింది. అత్యవసర పిటిషన్లను విచారించి.. రెగ్యులర్ వాటిని వాయిదా వేసినట్లు సమాచారం.
తిరుపతిలో షాద్‌నగర్ వాసికి గుండెపోటు
తిరుపతి జిల్లా చంద్రగిరిలో మంగళవారం రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌కు చెందిన వెంకటేశ్ గుండెపోటుతో చెందాడు. శ్రీవారి మెట్టు మార్గంలోని 200 మెట్టు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. నడక దారిన దర్శనానికి వెళ్తున్న భక్తుడు 200 మెట్టు వద్ద కుప్పకూలిపోయాడు. హుటాహుటిన ఆయనను చంద్రగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.






