రాష్ట్రంలో కొత్త పథకానికి అంకురార్పణ.. రేపే కేబినెట్ సబ్ కమిటీ భేటీ

by Kema Shiva Kumar |   (  Updated:2026-05-18 16:09:26  IST  )

తెలంగాణలో ప్రతి కుటుంబానికి ఉచిత జీవిత బీమా ప్రయోజనం కల్పించేలా సరికొత్త పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది.

రాష్ట్రంలో కొత్త పథకానికి అంకురార్పణ.. రేపే కేబినెట్ సబ్ కమిటీ భేటీ
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని ప్రతి సామాన్య కుటుంబానికి ఆర్థిక, సామాజిక భద్రత కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక పథకానికి శ్రీకారం చుట్టబోతోంది. అర్హులైన ప్రతి కుటుంబానికి ఏకంగా రూ.5 లక్షల జీవిత బీమా (Life Insurance) ప్రయోజనం చేకూర్చేలా ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ (Indiramma Kutumba Jeevitha Bima) పథకాన్ని ప్రారంభించేందుకు ఉత్తర్వుల జారీకి సన్నద్ధమవుతోంది. అనుకోని ప్రమాదం, విపత్తు జరిగి కుటుంబ యజమాని దూరమైతే, ఆ కుటుంబం రోడ్డున పడకుండా అండగా నిలిచేందుకు ఈ భారీ ఇన్సూరెన్స్ రక్షణను ప్రభుత్వం కల్పించనుంది. ఈ పథకానికి సంబంధించి పూర్తి స్థాయి విధివిధానాలు (Guidelines), అర్హతలు, రూల్స్‌ను ఖరారు చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఉన్నత స్థాయి కేబినెట్ సబ్ కమిటీని నియమించింది. ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ పథకం అమలుపై చర్చించేందుకు రేపు సబ్ కమిటీ కీలకమైన సమావేశాన్ని నిర్వహించనుంది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన జరగనున్న ఈ భేటీలో కమిటీ సభ్యులైన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస రెడ్డిలు పాల్గొననున్నారు.

Next Story